YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో హైవోల్టేజ్ పాలిటిక్స్... ఎన్నికల ఖర్చు ఆందోళన

ఏపీలో  హైవోల్టేజ్ పాలిటిక్స్...   ఎన్నికల ఖర్చు ఆందోళన

విజయవాడ, నవంబర్ 29,
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడూ ఊహించనంత  హైవోల్టేజ్ పొలిటికల్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సారి మూడు ప్రధాన పార్టీలు తలపడుతున్నాయి. రెండు జాతీయ పార్టీలతో బీఆర్ఎస్ హోరాహోరీ తలపడుతుంది. ఎవరు ముందున్నారు.. ఎవరు వెనుకబడ్డారన్న సంగతి పక్కన పెడితే.. చివరి బాల్  వరకూ విజయం కోసం ప్రయత్నించడమే కీలకం. ఆ దిశగా రాజకీయ పార్టీలు ఎక్కడా తగ్గడం లేదు. పూర్తి స్థాయిలో తమ ఎఫర్ట్స్ పెడుతున్నాయి. ఎప్పటికప్పుడు  ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు కౌంటర్ ఇవ్వడానికి తగ్గడం లేదు. అదే్ సమయంలో ఎలక్షనీరింగ్ విషయంలోనూ తమ సత్తా చూపిస్తున్నాయి. ఇప్పుడు ఎలక్షనీరింగ్ అంటే.. డబ్బులు ఖర్చు  పెట్టడమే. తెలంగాణ రాజకీయాల్లో చివరి క్షణాల్లో మార్పులు తీసుకు రావడానికి  రాజకీయ పార్టీలు చేయని  ప్రయత్నాలు అంటూ లేవు. ఎంత తీవ్రంగా రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయనేది రైతు  బంధు అంశంతోనే అర్థం చేసుకోవచ్చు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగా రైతు బంధు పంపిణీకి ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. కానీ అసలు విషయం కంటే.. కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందనే ప్రచారం బీఆర్ఎస్ నేతలు విస్తృతంగా చేశారు. రేవంత్ రెడ్డి రాసినట్లుగా ఉన్న ఓ లెటర్, కొన్ని మీడియా సంస్థల క్లిప్పింగ్‌తో విస్తృతంగా  బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేసింది. దీంతో రేవంత్ రెడ్డి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని మండిపడాల్సి వచ్చింది.  అయితే ఇక్కడ వాటిని  నమ్మేవారు కూడా ఉంటారు బీఆర్ఎస్‌కు కావాల్సింది అదే. ఒక్క బీఆర్ఎస్ పార్టీకే కాదు.. ఏ పార్టీది అయినా అదే వ్యూహం. తప్పా ఒప్పా అన్నది కాదు. ప్రజల్ని  నమ్మించగలిగి.. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడమో.. లేదా.. ప్రత్యర్థి పార్టీకి వ్యతిరేకం చేయడమో కీలకంగా భావిస్తున్నారు. అందు కోసం.. తప్పొప్పులు అనే పారామీటర్స్ పెట్టుకోకుండా రాజకీయం చేస్తున్నారు. ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే.. పాంప్లెట్లు, గోడలపై పోస్టర్లు ఆ తర్వాత పత్రికల్లో ప్రకటనలు. వాటికే ఖర్చు తడిసి మోపెడవుతుంది. కానీ ఇప్పుడు కొత్త కొత్త ప్రచార పద్దతులు అందుబాటులోకి వచ్చాయి. అందులో మొదటిది డిజిటల్ ప్రచారం. యూట్యూబ్ , వెబ్ సైట్స్, యాప్స్ ఏది ఓపెన్ చేసినా తెలంగాణ పార్టీల ప్రకటనలే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా ప్రచారానికి ఇప్పటి వరకూ బీఆర్ఎస్ పార్టీ కనీసం పది కోట్ల వరకూ ఖర్చు పెట్టి ఉంటుందని అంచనా.  కాంగ్రెస్ పార్టీ కూడా ఏ మాత్రం తగ్గలేదు. బీఆర్ఎస్ అంత కాకపోయినా దాదాపుగా ఎనిమిది కోట్లు ఖర్చుపెట్టి ఉంటాయని  చెబుతున్నారు. యూట్యూబ్ యాడ్స్, వెబ్ సైట్ ప్రకటనలు ఇలా  డిజిటల్ ప్రచారం కోసం పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు ఖర్చు పెట్టాయి. ఇక పత్రికా ప్రకటనల గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రతి రాజకీయ పార్టీ ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మేలు కలిగేలా కొత్తగా కర్ణాటక ప్రభుత్వం కూడా తెలంగాణలో ప్రకటనలు ఇచ్చింది. కానీ ఎక్కడా కాంగ్రెస్ ప్రస్తావన  లేకుండా జాగ్రత్త పడింది. తమ రాష్ట్రంలో అన్ని హామీలు అమలు చేస్తున్నామని చెప్పడమే ఉద్దేశం. ఈ ప్రకటనల ఖర్చు ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడం కష్టం. పోలింగ్ వరకూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకునే అవకాశం ఉంది. అప్పటి వరకూ ఖర్చు పెడుతూనే ఉంటారు. ఇక బరిలో ఉన్నరాజకీయ పార్టీ అభ్యర్థి తాను గట్టిగా నిలబడ్డానని చెప్పుకోవాలని.. నిరూపించుకోవాని అనుకుంటే.. ఊహించనంత హంగామా చేయాలి. ర్యాలీలతో హోరెత్తించారు. సభలు.. సమావేశాలు పెట్టాలి. ఇలాంటి వాటికి అయ్యే ఖర్చు గురించి అంచనా వేయడం కష్టమే. ప్రధాన నేతలకు కొంత మంది అనుచరులు ఉన్నప్పటికీ..  ఎక్కువ మందిని రోజుకూలీ ఇచ్చి తెచ్చుకోవాల్సిందే. ప్రచారంలో జెండాలు పట్టుకుని తిరిగే వారందా దాదాపుగా రోజు కూలీలే. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీలు ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టేసుకుంటున్నాయి. ఎందుకంటే..  డూ ఆర్ డై ఎలక్షన్ లాగామారిపోయింది. తెలంగాణలో రాజకీయం రాజకీయంలా సాగుతోంది. దాడులు, దౌర్జన్యాలు, ఓటర్లజాబితాలో  అవకతవకలు వంటి వివాదాలు లేవు. అయినా రాజకీయం హై వోల్టేజ్ పద్దతిలో సాగుతోంది. అదే ఏపీలో  ఎన్నికలు ఎలా జరుగుతాయన్నది మాత్రం ఊహించడం కష్టం.  ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల్ని చూస్తే దాడులు, దౌర్జన్యాలు చాలా కామన్. పోలీసు వ్యవస్థ పనితీరుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలపై వస్తున్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఎలాగైనా రెండో సాగి గెలవాలని వైసీపీ.. అధికారం దక్కించుకోవాలని టీడీపీ, జనసేన కూటమి ప్రయత్నాలు చేస్తాయి. డూ అర్ డై అన్నట్లుగా తలపడతాయని చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణలో ఉన్న పరిస్థితి రెండు, మూడింతలు ఎక్కువ ఉద్రిక్త పరిస్థితి.. అంతకు మించి ఖర్చులు కూడా ఉంటాయనడంతో సందేహం లేదు. అందుకే..  తెలంగాణ ఎన్నికల పరిస్థితిని చూస్తున్న వారికి.. ఏపీలో ఎన్నికలు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి ఏర్పడుతోంది.      

Related Posts