హైదరాబాద్
గురువారం జరగనున్న తెలంగాణ ఎన్నికలపై బెట్టింగ్ దందా జోరుగా సాగుతోంది. ఇప్పటికే రూ. 2,500 కోట్లకుపైగా దాందా సాగినట్లు సమాచారం. గురువారం సాయంత్రం విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ నుంచి ఫలితాలు వెలువడే డిసెంబర్ 3వ తేదీ వరకు బెట్టింగ్ దందా పది వేల రూపాయలు దాటినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నెల క్రితమే ఏపీలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ ఎన్నికలపై బెట్టింగులు సాగుతున్నాయని రూ. వెయ్యికోట్ల దందా జరిగినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. విజయవాడ, విశాఖపట్నం, ఏపీలోని పలు జిల్లాలతో సహ
ఏపీ, ముంబై, ఢిల్లీ, కోల్కతతోపాటు దేశంలోని పలు ఇతర నగరాల నుంచి ఇది జరుగుతున్నట్లు తెలుస్తోంది.