YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

డిసెంబర్ 8కాని 9 కానీ ముహూర్తం

డిసెంబర్ 8కాని 9 కానీ ముహూర్తం

విశాఖపట్టణం, డిసెంబర్ 2,
సీఎం రాక కోసం విశాఖ నగరం సిద్ధం అనే వార్తలు ఎప్పటికప్పుడు కొత్తగానే వినిపిస్తున్నాయి. మిషన్ విశాఖ ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. విజయదశమికి ఖచ్చితంగా వచ్చుడే అంటూ సీఎం పేషీ నుంచి స్పష్టమైన ప్రకటన కూడా వచ్చింది. ముఖ్యమంత్రి కూడా సమాయత్తత ప్రకటించారు. కానీ.. తగిన రీతిలో ఏర్పాట్లు పూర్తి కాకపోవడంతో దశమి ముహూర్తం కూడా వాయిదా పడింది. విశాఖలో సీఎం క్యాంపాఫీసు నిర్మాణం అనే ప్రక్రియ కోసం ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటై.. యుద్ధప్రాతిపదికన యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. ఉత్తరాంధ్ర సమతుల్య అభివృద్ధి కోసం తరచూ విశాఖలో ముఖ్యమంత్రి పర్యటన ఉండవచ్చని, ఆయనతో పాటు మంత్రులు, సీనియర్ అధికారులు వైజాగ్ తీరంలో బస చేయాల్సి ఉంటుందని.. ఆ దిశగా కమిటీ కసరత్తు చేస్తోందని తాడేపల్లి నుంచి వార్తలొచ్చాయి.ఇటీవల అక్టోబర్‌1న మైక్రోసాఫ్ట్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు సమయంలో ముఖ్యమంత్రి కూడా ఛలో విశాఖపై క్లారిటీ ఇచ్చారు. విశాఖ టైప్‌2 సిటీ కనుక.. జరగాల్సినంతగా అభివృద్ధి జరగడం లేదని, తాను విశాఖకు వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని చెప్పారు సీఎం జగన్. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో విశాఖ క్యాంప్ ఆఫీసు గృహప్రవేశం వాయిదా పడుతూ వచ్చింది. ఇటు.. టూరిజం భవనాల మీద వివాదం మొదలైంది. రుషికొండ మీద భవనాలు నిర్మిస్తోంది టూరిజం శాఖ. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ… సీఎం నివాసం కోసం ఐదు ప్రాంతాల్ని సిఫార్సు చేసింది. భద్రతాపరంగా, నివాస యోగ్యత కలిగిన ప్రాంతంగా రుషికొండ అన్నిటికంటే బెటరని సూచించింది. టూరిజం శాఖక్కూడా ఈ మేరకు లేఖ రాసింది. విశాఖలో నాలుగు రోజులపాటు ఉండి ఉత్తరాంధ్ర పై సీఎం జగన్ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. అయితే అది ఉత్తరాంధ్ర పై ప్రేమ కాదని.. రూ. 500 కోట్ల రూపాయలతో ముచ్చటపడి కట్టించుకున్న ప్యాలెస్ లో నాలుగు రోజులు పాటు విడిపించేందుకేనని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి దీనిపై ఎటువంటి ప్రకటన లేదు. అధికారికంగా చేయలేని స్థితిలో వైసిపి ప్రభుత్వం ఉంది. ఎందుకంటే అది నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణం. హైకోర్టులో కేసు కూడా నడుస్తోంది. అక్రమ కట్టడం అని తేల్చేసిన పరిస్థితి ఉంది. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కేంద్ర పర్యావరణ శాఖ.. రెండు, మూడు వారాల్లో రిపోర్టు ఇవ్వనుంది.రిషికొండలో నిర్మాణాల విషయంలో వైసీపీ సర్కార్ దాగుడుమూతల ఆట ఆడుతోంది. అక్కడ ఏ నిర్మాణం చేపడుతున్నారో చెప్పలేని స్థితిలో ఉండడం విశేషం. అన్ని రకాల పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సి ఆర్ జెడ్ నిబంధనలకు గాలికి వదిలేసారు అన్న విమర్శలు ఉన్నాయి. ఈ భవనం కూల్చేయాలని కోర్టు ఆదేశించినా ఆశ్చర్యపోనవసరం లేదని న్యాయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే 500 కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేయడంతో.. ఏం చేస్తారన్న ఉత్కంఠ సర్వత్రా ఉంది. ఇప్పటికే ఈ నిర్మాణాల ప్రారంభం పూర్తయింది అన్న వార్త ఒకటి వినిపిస్తోంది.ఇటువంటి తరుణంలో సీఎం జగన్ ఆ భవనాల్లో కూర్చొని సమీక్ష చేస్తారని తెలియడం ఆసక్తి రేపుతోంది. కోర్టు ఇంకా స్పష్టతనివ్వకుండా.. ఆ భవనాల్లో ఎలా సమీక్షిస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాజ్యాంగాన్ని, చట్టాన్ని పాటించాల్సిన పాలకుడే నిబంధనలు పాటించకపోవడం ఏమిటన్న ప్రశ్న ఎదురవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉందని ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించిన జగన్.. నిబంధనలకు విరుద్ధమైన భవనాలు నిర్మించి.. అందులో నుంచి పాలన చేయాలనుకోవడం మాత్రం కొంచెం అతి అవుతుందిసూత్రప్రాయంగా అంగీకారం లభించింది.. జీవో రిలీజ్ కావడం ఒక్కటే మిగిలింది.అటు.. సీఎం క్యాంపాఫీసు నిర్మాణ పనులు 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఇంటీరియర్ వర్క్ ముగిసి… రెడీమేడ్ ఫర్నిచర్ బిగించడాన్ని వర్కవుట్ చేస్తున్నారు. ఒక్కసారి డేట్ ఫిక్స్ అయితే సీఎం నివాసం సంపూర్ణం అవుతుందంటోంది నిర్మాణ సంస్థ. ఈ నేపథ్యంలోనే డిసెంబర్‌ 8 లేదా 9న సీఎం గృహప్రవేశం చేస్తారని వార్తలు గుప్పుమన్నాయి. రేపోమాపో అధికారిక ప్రకటన వచ్చినా ఆశ్చర్యం లేదని టాక్ వినిపిస్తోంది.

Related Posts