YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కౌంటింగ్ కు అంతా సిద్ధం

కౌంటింగ్ కు అంతా సిద్ధం

హైదరాబాద్, డిసెంబర్ 2,
కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌లో 14 చోట్ల కౌంటింగ్ జరుగుతుంది. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ పోస్టల్ ఓట్ల కౌంటింగ్.. ఎనిమిదిన్నర నుంచి ఈవీఎంల లెక్కింపు ఉంటుందని వికాస్ రాజ్ చెప్పారు. తెలంగాణలో మొత్తం 71.06శాతం పోలింగ్ జరిగిందన్నారు. మునుగోడులో అత్యధికంగా 91.5 శాతం పోలింగ్ నమోదు కాగా.. యాకుత్‌పురాలో అత్యల్పంగా 39.6శాతం పోలింగ్ నమోదైనట్లు వికాస్ తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్‌కు అవకాశం లేదని సీఈఓ తెలిపారు. ఆదివారం జరిగే కౌంటింగ్ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
తెలంగాణ అంతటా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని.. 3కోట్ల 26లక్షల ఓట్లు కాగా పురుషుల కంటే మహిళల ఓట్లు ఎక్కువ ఉన్నాయని వెల్లడించారు. దేవరకద్రలో 10మంది ఉన్నా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం ల మార్పిడి జరిగిందని.. ఆయా పార్టీ ఎజెంట్ల మధ్యనే స్ట్రాంగ్ రూమ్ కి తరలింపు జరిగిందని తెలిపారు. పోలింగ్ పై స్క్రూటినీ శుక్రవారం ఉదయం నుంచి జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని.. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 40 కేంద్ర కంపెనీల బలగాలు భద్రతలో ఉన్నాయన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువ పోలింగ్ శాతం నమోదు అయిందన్నారు.లెక్కింపు జరిగిన కూడా మళ్ళీ రెండు సార్లు ఈవీఎం లు లెక్కిస్తారన్నారు. ప్రతీ రౌండ్ కు సమయం పడుతుంది.. ECI నిబంధనల ప్రకారం జరుగుతుందని వివరించారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లతో కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. 8.30 నిమిషాల నుంచి ఈవీఎం ల లెక్కింపు ఉంటుందని.. ప్రతి టేబుల్ కు 5 గురు ఉంటారు.. కౌంటింగ్ కోసం పూర్తిగా సిద్ధం అవుతున్నమన్నారు.

Related Posts