అమలాపురం
తన కూతురు ప్రాణం కాపాడిన జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అమలాపురం నుండి శబరిమలై కు తండ్రి పాదయాత్ర చేస్తున్నారు.
అల్లవరం మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన కొప్పాడి రాంబాబు తన కుమార్తె హనీ(4) కి అరుదైన వ్యాధి సోకింది. జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రిని తన కుమార్తెను ఆదుకోవాలంటూ వినతి చేసారు. తక్షణమే పాపను చూసి ముఖ్యమంత్రి జగన్ కోటి రూపాయలు మంజూరు చేసారు.
ప్రాణాలు కాపాడిన ముఖ్యమంత్రి జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని నూట ఎనిమిది రోజులు దీక్ష చేసి అమలాపురం అయ్యప్ప స్వామి ఆలయం శబరిమలై అయ్యప్ప కొండకు పాదయాత్రగా వెళ్తున్న రాంబాబుకు మంత్రి పినిపే విశ్వరూప్ సంఘీభావం తెలిపారు. రాంబాబు చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేయాలని, ఆయన కోరుకుంటున్నారు జగనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి అన్నారు.