Highlights

ఐపీఎల్ - 11 లో రికార్డుల మోత మోగింది. 51 రోజులపాటు సాగిన ఐపీఎల్-11 సందడిలో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. వాటిలో కొన్ని ముఖ్యమనవాటిని చూద్దాం!
* ఫైనల్లో లక్ష్య ఛేదనలో శతకం బాదిన ఏకైక క్రీడాకారుడు షేన్ వాట్సన్
* ఒక జట్టును మరొక జట్టు నాలుగుసార్లు ఓడించిన దాఖలాలు ఏ సీజన్‌లోనూ లేవు. ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు నాలుగుసార్లు తలపడగా అన్నింట్లోనూ చెన్నై జట్టే విజయం సాధించింది.
* సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి కేన్ విలియమ్సన్ మాత్రమే ఈ సీజన్‌లో ఎనిమిది అర్ధశతకాలు నమోదు చేశాడు.
* అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు ఆండ్రూ టై నిలిచాడు.
* కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి చెందిన కేఎల్ రాహుల్ వేగవంతమైన ఐపీఎల్ 50 సాధించాడు.
* ఆస్ట్రేలియాకు చెందిన ఆరోన్ ఫించ్‌ది మరో విచిత్రమైన రికార్డు. ఈ ఏడాది కింగ్స్ పంజాబ్‌కి ఆడిన ఆరోన్ ఫించ్... ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఆరు జట్ల తరఫున ఆడాడు. పంజాబ్ ఏడోది.
* వంద టీ 20లు ఆడటం పెద్ద విషయం కాదు. 19 ఏళ్లకే అంటే పెద్ద విషయమే కదా. అఫ్గానిస్థాన్‌కు చెందిన రషీద్ ఖాన్ ఈ ఘనత సాధించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడిన రషీద్ వందో మ్యాచ్ ఆడటం, అందులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించడం విశేషం.
* చెన్నై యోధుడు మహేంద్ర సింగ్ ధోనీ టీ 20ల్లో ఐదు వేల పరుగులు పూర్తి చేశాడు. ఐదు వేల పరుగులు చేసిన తొలి టీ 20 కెప్టెన్ ధోనీనే.
* ఈ ఏడాది నేపాల్ నుంచి ఓ క్రికెటర్ ఐపీఎల్‌లో ఆడాడు. దిల్లీ డేర్‌డెవిల్స్ బౌలర్ సందీప్ లామిచానె నేపాల్‌కి చెందినవాడు. అలా నేపాల్ నుంచి వచ్చిన తొలి ఆటగాడిగా సందీప్ రికార్డులకెక్కాడు.