YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

అంబెద్కర్ ను స్మరించుకోవాలి : కడియం

అంబెద్కర్ ను స్మరించుకోవాలి : కడియం
జనగామ జిల్లా వెంకిర్యాల గ్రామం లో బాబా సాహెబ్ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి సోమవారం నాడు ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమానికి పీలు బండ ప్రకాష్, బూర నర్సయ్య గౌడ్, ప్రభుత్వ విప్ బోడెకుంటి వెంకటేశ్వర్లు, స్థానిక ఎమ్మెల్యే మూతిరెడ్డి యదగిరిరెడ్డి, జడ్పి చైర్ పర్సన్ గద్దల పద్మ, స్థానిక నేతలు హజరయ్యారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రతి  గ్రామంలోనేకాదు ... ప్రతి హృదయంలోనూ  అంబేద్కర్ ను ప్రతిష్టించుకోవాలని అన్నారు. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల వల్లే ఈరోజు మేము మీ ముందు మాట్లాడగలుగుతున్నాం. మీ గ్రామం ఇతరులకు ఆదర్శంగా ఉండే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని , గ్రామాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. గ్రామంలో కట్టుకున్న ప్రతి మరుగుదొడ్డిని ఉపయోగించాలి..బహిర్భుమికి వెళ్లేవారికి వెయ్యి రూపాయల జరిమానా వెయ్యాలి. ఎస్సీ కమ్యునిటీ హాల్ కు 10 లక్షల రూపాయలు, మహిళల కమ్యునిటీ హాల్ కు 10 లక్షల రూపాయలు నా ఫండ్ నుంచి ఈ గ్రామానికి ఇస్తాను. మిల్క్ సెంటర్ కోసం ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఇచ్చిన ఆరు లక్షలు వాడుకోవాలని  సూచించారు. ముదిరాజ్ కమ్యునిటీ హాల్ కోసం ఎంపీ బండ ప్రకాశ్ 10 లక్షలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎల్.ఈ.డీ లైట్ల కోసం జడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ 5 లక్షలు రూపాయలు ప్రకటించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీరివ్వాలన్న లక్ష్యం తెలంగాణ ప్రభుత్వంది. ఏదైనా సమస్యలుంటే 15 రోజుల్లో పూర్తి చేయాలి . క్యాన్ వాటర్ కంటే మిషన్ భగీరథ వాటర్ చాలా మంచిది.ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరి ఎక్కువ పండుతున్నప్రాంతం ఇప్పుడు జనగామా. తెలంగాణ రాష్ట్రం రావడం, సిఎం కేసిఆర్ కావడం వల్లే రెండో పంటకు కూడా నీరందుతుందని అన్నారు. రైతులు అప్పులు చేయకూడదనే ఉద్దేశ్యంతోనే సిఎం కేసిఆర్ రైతుబంధు పథకం కింద ఎకరాకి ఏడాదికి 4000 రూపాయలను పంట పెట్టుబడిగా ఇస్తున్నారు. నవంబర్ 19  నుంచి రెండో విడత కింద మరో 4000 రూపాయలు ఇవ్వనున్నారని తెలిపారు. ఎన్నికల హామీలో లేకున్నా రైతులకు సాయంచేయాలన్న ఏకైక ఉద్దేశ్యంతో ఈ పథకం తీసుకువచ్చారు.  రైతులు దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేలా ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి రైతుబీమా పథకం తీసుకువస్తున్నారు. పేదింట్లో ఆడపిల్ల పెళ్లి కోసం తల్లిదండ్రులు బాధపడొద్దని పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1,00,116 రూపాయలను కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ పథకం ద్వారా ఇస్తున్న మనసున్న మారాజు సిఎం కేసిఆర్. బోధించు, సమీకరించు, సాధించు అన్న అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా ఈ రోజు నాణ్యమైన విద్య తెలంగాణ రాష్ట్రంలో అందించాలని గత నాలుగేళ్లలో 540గురుకులాలు తీసుకొచ్చిన ఘనత సిఎం కేసిఆర్ ది. అంబేద్కర్ సిద్దాంతాలు, ఆశయాల అమలులో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామన్నారు.

Related Posts