విశాఖపట్నం
మిచాంగ్ తుపాను తీవ్ర తుపానుగా మా రిందని,ఉత్తర దిశగా కదులుతూ బాపట్ల వద్ద తీరం దాటుతుందని విశాఖ వాతావరణ శాఖ అధికారి సునంద తెలిపారు.తీరం దాటే సమయంలో భారీ అలలు తీరం వెంబడి ఉంటాయని,తీరం దాటినా అనంతరం తుఫాన్ గాను,వాయుగుండం గా మారి క్రమంగా బలహీనపడుతుందని చెప్పారు.ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో నెల్లూరు,ప్రకాశం,గుంటూరు జిల్లా లో80- 90కిలోమీటర్లు వేగం ఈదురుగాలులు ఉంటా యని, రాగల 24 గంటల్లో రాష్ట్రంలో చాలా చోట్ల విస్తా రంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. మత్స్యకా రులు రాగల 48 గంటల వరకు వేటకు వెళ్లకూడదని, బాపట్ల,నిజాంపట్నం మచిలిపట్నం లలో 10వ నెంబర్, కాకినాడ 9వ నెంబర్ విశాఖ ,కళింగ పట్నం 3 ప్రమాద సూచిక జారీ చేశామని తెలిపారు.