చెన్నై డిసెంబర్ 5
తమిళనాడు దివంతగ సీఎం జయలలిత స్నేహితురాలు వీకే శశికళ కు మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. అన్నాడీఎంకే పార్టీకి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా తనను కొనసాగించాలని ఆమె పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. జస్టిస్ ఆర్ సుబ్రమణియన్, ఎన్. సెంథిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఆ కేసులో తీర్పును ఇచ్చింది. 2022లో శశికళ దాఖలు చేసిన మూడు అప్పీల్స్‌ను బెంచ్ తిరస్కరించింది. మాజీ సీఎం జయలలిత మృతి తర్వాత 2016, డిసెంబర్ 29వ తేదీన అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీగా శశికళను నియమించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆమెను తొలగించారు. అయితే ఆ పోస్టులో తననే ప్రకటించాలని ఆమె పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు కొట్టిపారేసింది.