YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హాయ్ నాన్న’ ఎమోషనల్ విజువల్ ట్రీట్.

హాయ్ నాన్న’ ఎమోషనల్ విజువల్ ట్రీట్.

నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్ నాన్న'.  వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలని పెంచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చిత్ర విశేషాలని పంచుకున్నారు.
సీతారామం తర్వాత మీపై ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఏర్పడ్డాయి కదా.. ‘హాయ్ నాన్న’ సినిమా చేయడానికి మీకు స్ఫూర్తిని ఇచ్చిన అంశం ఏమిటి ?
సీతారామం తర్వాత ప్రేక్షకులు ఇంకా వైవిధ్యమైన పాత్రల్లో చూడాలనుకుంటున్నారు. ఖచ్చితంగా వారందరినీ అలరించాలి. అందుకే నా మనసుకు దగ్గరైన పాత్రలు, సినిమాలు చేయడంపై ద్రుష్టి పెట్టాను. సీతారామం తర్వాత ప్రేక్షకుల్లో ఖచ్చితంగా అంచనాలు వుంటాయి. హాయ్ నాన్న చేయడనికి ప్రధాన కారణం కథ. ‘హాయ్ నాన్న’ చాలా అద్భుతమైన కథ. తెరపై విరాజ్, యష్ణ ప్రయాణాన్ని చూసిన ప్రేక్షకులు ఖచ్చితంగా వారితో ప్రేమలో పడిపోతారు.  
సీతారామం, హాయ్ నాన్న ..ఈ రెండు కూడా ఎమోషన్ పై నడిచే సినిమాలే కదా.. పాత్రల్లో వుండే వైవిధ్యం ఏమిటి ?
సీతారామం, హాయ్ నాన్న.. దేనికవే ప్రత్యేకమైన చిత్రాలు. సీతారామం 60, 70దశకంలో జరిగే కథ. హాయ్ నాన్న నేటితరాన్ని ప్రతిభింబించే కథ. ఇందులో నా పాత్ర కూడా న్యూ ఏజ్ అమ్మాయిగా వుంటుంది. నా పాత్రలో అన్ని ఎమోషన్ వున్నాయి. యష్ణ పాత్రలో చాలా లేయర్స్ వుంటాయి. హాయ్ నాన్న హ్యూమన్ రిలేషన్స్, ఎమోషన్ ని అద్భుతంగా ప్రజంట్ చేస్తోంది. హాయ్ నాన్న అద్భుతమైన కథ. ఒక్కమాటలో చెప్పాలంటే.. డివైన్. షూటింగ్ చేస్తున్నప్పుడు అదే భావనతో నటించాను.
హాయ్ నాన్న.. ఫాదర్ నేపధ్యంలో వుండే కథ కదా... మీ ఫాదర్ తో మీకు వున్న అనుబంధం గురించి చెప్పండి ?
నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. నా బిగ్గెస్ట్ ఇన్‌స్పిరేషన్ నాన్న. ఈ రోజు నేను ఇలా ఉండటానికి కారణం మా నాన్న. ఎన్ని సమస్యలు వున్నా హాయిగా నవ్వుతూ జీవితాన్ని గడపాలని నేర్పించారు. మంచి విషయాలు జరగడానికి సమయం పడుతుందని, జీవితంఓ ఓర్పుతో వుండాలని చెబుతుంటారు. నాన్న నా జీవితానికి మూలస్థంభం.
నాని గారిని నేచురల్ స్టార్ అంటారు.. ఆయనతో నటించడం చాలా సులువుగా ఉంటుందని హీరోయిన్స్ చెబుతుంటారు.. మీకు ఎలా అనిపించింది?
నాని చాలా సపోర్టివ్. నటించేటప్పుడు చాలా విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు. ఆయన వండర్ఫుల్ కో స్టార్. ఆయనతో నటిస్తుంటే పెర్ఫార్మెన్స్ మరింత ఎలివేట్ అవుతుంది. నాని గారితో వర్క్ చేయడం చాలా మంచి అనుభూతి. ఇందులో చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ వుంటుంది. మీరంతా తెరపై చూసి ఎంజాయ్ చేయాలని ఎదురుచూస్తున్నాను.
హాయ్ నాన్న పై చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు ? కారణం ?
నమ్మకం వుంది. దీంతో పాటు నిజాయితీ వుంది. చాలా నిజాయితీగా పని చేశాం. ఒక ఆర్టిస్ట్ గా ఎలాంటి సినిమా చేస్తున్నామో మన మనసుకి తెలిసిపోతుంది. కథని పాత్రలని బలంగా నమ్మి అంతే నిజాయితీతో చేసిన సినిమా ఇది. నేనే కాదు.. నాని గారు, శౌర్యువ్, మా డీవోపీ షాను, సంగీత దర్శకుడు, కాస్ట్యూమ్ డిజైనర్ శీతల్ గారు ఇలా టీం అంతా చాలా నిజాయితీ పని చేసేవాళ్ళే. నాని గారు ఎంత హంబుల్ గా వుంటారో మనందరికీ తెలుసు.  
దర్శకుడు శౌర్యువ్ గారితో వర్క్  చేయడం ఎలా అనిపించింది ?
శౌర్యువ్ గారితో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. కొత్త దర్శకుడితో పని చేస్తున్నామనే భావన రాలేదు. తన విజన్, అప్రోచ్ చాలా క్లారిటీగా వుంటాయి. తన క్రియేట్ చేసిన మ్యాజిక్ డిసెంబర్ 7న ప్రేక్షకులు చూస్తారు. ‘హాయ్ నాన్న’ విజువల్ ఎమోషనల్ ట్రీట్. తన దర్శకత్వంలో మళ్ళీ నటించాలని వుంది.
హాయ్ నాన్నలో సవాల్ గా అనిపించిన సన్నివేశం ఏమిటి ?
‘హాయ్ నాన్న’ లో పాట పాడటం కాస్త ఛాలెంజ్ గా అనిపించింది. ఇందులో ‘అమ్మాడి’ పాటలో పెర్ఫెక్ట్ గా లిప్ సింక్ చేయాలి. నేను ప్రొఫెషనల్ సింగర్ ని కాదు. ప్రతి పదాన్ని ట్యూన్ కి తగ్గట్టు లిప్ సింక్ చేయాలి. అది కాస్త సవాల్ గా అనిపించింది.
బేబీ కియారా గురించి ?
కియారా చాలా క్రమశిక్షణ గల పాప. చాలా క్యూట్. తనతో వర్క్ చేయడం చాలా మంచి అనుభూతి. సన్నివేశం, అందులో వున్న ఎమోషన్, డైరెక్షన్ చాలా బాగా అర్ధం చేసుకుంటుంది. ఇందులో రాక్ స్టార్ తనే. తన పాత్ర చాలా కీలకంగా వుంటుంది. ప్రేక్షకులని హత్తుకుంటుంది.  
హేషం అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ గురించి ?
హాయ్ నాన్నలో మ్యూజిక్ చాలా కీలకం. హేషం అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సమయమా, అమ్మాడి, గాజు బొమ్మ, ఓడియమ్మ .. ఇలా పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్  వచ్చింది. ఇందులో పాటలన్నీ దేనికవే ప్రత్యేకం. హేషం తన సంగీతంతో పెర్ఫార్మెన్స్ లని మరో లెవల్ కి తీసుకెళ్ళారు. నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా ఉండబోతుంది. సినిమా చూస్తున్నపుడు ప్రేక్షకుల మ్యూజిక్ ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఇందులో ’అమ్మాడి’ పాట  ఫేవరేట్. ఆ పాటని హమ్ చేస్తూనే వుంటాను. అనంత శ్రీరామ్ గారు ఆ పాటకు చాలా అర్ధవంతమైన సాహిత్యం అందించారు.
వైర ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
వైర ఎంటర్‌టైన్‌మెంట్ వండర్ఫుల్ ప్రొడక్షన్ హౌస్. మోహన్ గారు, విజయేందర్ రెడ్డి గారు ప్యాషనేట్ ప్రోడ్యుసర్స్. గోవా, ఊటీ. ముంబై, హైదరాబాద్ ఇలా చాలా అద్భుతమైన లోకేషన్స్ లో షూట్ జరిగింది. ఎక్కడా రాజీపడకుండా సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్ లో మరిన్ని చిత్రాలు చేయాలని వుంది.
సినిమాలతో పాటు హిందీలో వెబ్ సిరిస్ లో కూడా నటిస్తున్నారు కదా.. తెలుగు వెబ్ సిరిస్ కథలు ఏవైనా విన్నారా ?
తెలుగు, హిందీ ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తున్నాను. అయితే వెబ్ సిరిస్ అనేది లాంగర్ ఫార్మాట్. దానికి సమయంతో పాటు భాష లో కూడా సౌకర్యం వుండాలి. ప్రస్తుతానికి నా దృష్టి తెలుగు సినిమాలపైనే వుంది.  
తక్కువ చిత్రాలతోనే స్టార్ కేటగిరీలోకి వెళ్ళారు కదా. ఎలా అనిపిస్తుంది ?
ఇంకా ఎత్తుకు ఎదగాలి. ఇంకా మంచి మంచి చిత్రాలు పాత్రలు చేయాలి. ప్రేక్షకులకు నా పేరు గుర్తులేకపోయినా పర్లేదు కానీ నేను సీతగా, యష్ణగా..  ఇలా నేను చేసిన పాత్రలతో గుర్తుండిపోవాలి. దాని కోసం నిజాయితీగా కష్టపడి పని చేస్తా.  
కొత్త ప్రాజెక్ట్స్ గురించి
ఫ్యామిలీ స్టార్ చేస్తున్నాను. అలాగే హిందీ సినిమాల షూటింగ్ జరుగుతోంది. తెలుగులో కొన్ని కథలు వింటున్నాను. మంచి కథ రావడానికి సమయం పడుతుంది.

Related Posts