YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

డాక్టర్ అంబెద్కర్ కు సీఎం జగన్ నివాళులు

డాక్టర్ అంబెద్కర్  కు సీఎం జగన్ నివాళులు

అమరావతి
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం  వైఎస్.జగన్  అంబేద్కర్ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో  హోంశాఖ మంత్రి తానేటి వనిత, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు(సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకరరావు తదితరులు పాల్గోన్నారు.

బాబాసాహెబ్ అంబేడ్కర్ కు నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు
భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నేత, స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రిగా ఇలా అంబేడ్కర్ గురించి ఎంత చెప్పుకునా తక్కువేననడంలో అతిశయోక్తి లేదని,అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన ఎంతగానో శ్రమించారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్ అన్నారు, బుధవారం మంథని అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్,జిల్లా ఉపాధ్యక్షులు నూకల బాణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి జనగామ నర్సింగరావు, జిల్లా కార్యదర్శి కుడుదుల వెంకన్న, బిసి సెల్ అధ్యక్షులు గోటికారి కిషన్ జీ,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్,డివిజన్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ ఎరుకల రమేష్ బాబు,టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలు శివ, డివిజన్ ఎస్సి సెల్ అధ్యక్షులు మంథని సత్యం, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు మంథని రాకేష్,తెలంగాణ రాష్ట్ర  అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు,  జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి  ఆర్ల నాగరాజు, పట్టణ బిసి సెల్ అధ్యక్షులు బండారి ప్రసాద్,ఎంపిటిసి పెండ్లి ప్రభాకర్ రెడ్డి, మంథని మున్సిపల్ కౌన్సిలర్స్ పెండ్రి రమ రెడ్డి,చొప్పకట్ల హనుమంతు, సర్పంచ్లు జాగిరి సదానందం,తమ్మిషెట్టి రమేష్, పర్శవేనా మోహన్ యాదవ్, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ రేపాక శ్రీకాంత్, మాజీ సర్పంచ్ చంద్రు రాయమల్లు, నాయకుడు పేరావేనా లింగయ్య యాదవ్,సీనియర్ నాయకులు లైశెట్టి రాజు,పర్శ శ్రీనివాస్,మంథని లింగయ్య,జనగామ సడవలి, రొడ్డ రాజేశ్వర్ రావు,అక్కపాక సదయ్య, పోగుల సాగర్,మోహన్,మంథని శ్రీను,రాజమల్లు,అయేషా, ఐశాన్,సల్మాన్, ఫాహెం, శ్రీకాంత్, రేపాక లక్ష్మణ్ నాయకులు పాల్గొన్నారు.

Related Posts