YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

హెచ్‌1బీ వీసాల పెంపు..?

 హెచ్‌1బీ వీసాల పెంపు..?

అమెరికాలో హెచ్‌1బీ వీసాల సంఖ్యను పెంచాలని కోరుతూ సెనేట్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. ప్రతిభావంతుల్ని అమెరికాకు రప్పించాలనే లక్ష్యంతో ఇద్దరు రిపబ్లికన్‌ సెనేటర్లు ఓర్రిన్‌ హాచ్, జెఫ్‌ ఫ్లేక్‌ ఇమ్మిగ్రేషన్‌ ఇన్నోవేషన్‌ యాక్ట్‌ 2018 పేరుతో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం హెచ్‌1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు, పిల్లలకు వర్క్‌ పర్మిట్‌ కల్పించాలని కోరుతున్నారు. ఈ వీసాదారులు ఉద్యోగాలు మారేందుకు తగిన సమయం కల్పించాలని భావిస్తున్నారు. ఈ బిల్లుకు మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌ సహా అమెరికాలోని పలు ప్రముఖ ఐటీ కంపెనీలు, అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఐటీ ఇండస్ట్రీ కౌన్సిల్‌ సహా పలు వాణిజ్య సంఘాలు మద్దతిస్తున్నాయి. 

అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థతో  అమెరికా పోటీపడేందుకు ఉపయోగపడే విధంగా బిల్లు ప్రతిపాదనలు ఉన్నాయని సెనేటర్లు హాచ్‌, ఫ్లేక్‌ పేర్కొన్నారు. అమెరికా ఉద్యోగుల కొరత ఉన్నచోట ఈ హెచ్‌1బీ వీసాలు కంపెనీలకు ప్రతిభావంతులైన ఉద్యోగులను అందిస్తున్నాయని, మోసపూరిత ఉద్యోగులను నియంత్రిస్తున్నాయని తెలిపారు. ప్రతిభావంతుల వలసలు  దేశానికి లాభం చేకూరుస్తాయని చెప్పారు. అయితే దీనిని ఔట్‌సోర్స్‌ ఉద్యోగాలకు ఉపయోగించుకోవద్దని, అమెరికన్ల జీతాలు తగ్గేలా ఉండొద్దని వెల్లడించారు. ఈ బిల్లులో హెచ్‌1బీ వీసాల సంఖ్యను 65వేల నుంచి 85వేలకు పెంచాలని ప్రతిపాదించారు.

 

 

Related Posts