YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రైతులను అన్ని విధాల ఆదుకుంటాం మంత్రి కారుమూరి

రైతులను అన్ని విధాల ఆదుకుంటాం మంత్రి కారుమూరి

పామర్రు
కృష్ణా జిల్లా పామర్రు లో తుఫాను తో నీట మునిగిన పంట పొలాలను, ధాన్యాన్ని  పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరిశీలించారు.
మంత్రి కారుమూరి మాట్లాడుతూ మీచౌన్ తుఫాన్ తో   కృష్ణ,  ఎన్టీఆర్ జిల్లాల  రైతులకు ఎక్కువ నష్టం జరిగింది.  చాలా చోట్ల  పనలపై ఉన్న వరి పంట నీళ్లలో తెలియాడుతుంది.  ముఖ్యమంత్రి   జగన్మోహన్ రెడ్డి  ప్రతి అంశంపై మానిటరింగ్ చేస్తున్నారు. నష్టపోయిన రైతులు అన్ని విధాల   ఆదుకోవాలని   అధికారులకు సూచనలు చేశారు. ఈ జిల్లాలో డ్రయ్యర్  మిల్లులు ఎక్కువగా  లేనందున ఇక్కడ ధాన్యాన్ని   పల్నాడు, బాపట్ల, ఏలూరు పశ్చిమగోదావరి జిల్లాలకు తరలిస్తున్నాం. ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ  అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.  పౌర సరఫరాల శాఖ తరపున రైతులను ఆదుకునేందుకు  అన్ని చర్యలు  తీసుకుంటున్నాం.  అపరాల విత్తనాలు దెబ్బతినచోట్ల .. రైతులకు సబ్సిడీపై అందించేందుకు  వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టిందని అన్నారు.
 మిల్లుల వద్ద లారీల్లో ధాన్యాన్ని  యుద్ధ ప్రాతిపదికన దిగుమతి చేసుకున్నందుకు   అన్ని చర్యలు తీసుకుంటున్నాం.  అకాల వర్షంలకు నష్టపోయిన  రైతులను దోచుకునేందుకు ప్రయత్నించే మిలర్స్ పై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు 6 లక్షల 70 వేల  మెట్రిక్ టన్నుల  ధాన్యాన్ని తీసుకున్నాం.  1300 కోట్ల రూపాయలకు గాను..   1070 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశాం.  ఆఫ్లైన్లో 1,10,000 టన్నులు ధాన్యం తీసుకున్నాం.  కార్డు లేని కౌలు రైతుల వద్ద నుంచి   ధాన్యాన్ని సొసైటీల ద్వారా కొనుగోలు చేస్తాం..  చెల్లింపులు సొసైటీల ద్వారా చేస్తామని అన్నారు.
ఇతర జిల్లాలకు తరలించే ధాన్యానికి  ట్రాన్స్పోర్ట్ చార్జీలు రైతులపై పడకుండా చూస్తాం.  రైతులను  అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి అన్నారు.

రాజోలు లో రైతుల రాస్తారోకో
రాజోలులో రైతులు రోడ్డెక్కారు.  216 జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు వలన పంట నష్టం వాటిల్లిందని రైతుల ఆందోళన వ్యక్తం చేసారు. ప్రభుత్వం ప్రకటించిన ఇన్సూరెన్స్ పాలసీ వెంటనే అమలు చేసి రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేసారు. రాజోలు ఎమ్మార్వో హామీ ఇస్తే కానీ ఆందోళన  ఆపమని  రైతులు అన్నారు.

Related Posts