YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణ అవతరణ ఉత్సవాలకు సిద్ధం

తెలంగాణ అవతరణ ఉత్సవాలకు సిద్ధం
తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణం తలపించేలా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై రివ్య్యూ సమావేశాలు నిర్వహించారు.  రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, ఆదేశాలకనుగుణంగా జూన్ 2న జిల్లా, డివిజన్, మండల, పంచాయతీలతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేయనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా జిల్లాలో 3రోజుల పాటు వేడుకలను, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.అలాగే 2వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూడు రోజుల పాటు విద్యుత్‌దీపాలతో అలంకరించాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా నగరంలోని ప్రధాన కూడళ్లను విద్యుత్‌దీపాలతో అలంకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌కు కలెక్టర్ సూచించారు. సమాజ సేవా కార్యక్రమంలోభాగంగా వైద్యశాలల్లో రోగులకు పండ్లను పంపిణీ చేయాలని, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. పోలీసు పరేడ్ మైదానంలో జరిగే పోలీసు కవాతు, గౌరవ వందన స్వీకారం, మైదాన ఏర్పాట్లను ముందస్తుగానే చూసుకోవాలని పోలీసు అధికారులకు కలెక్టర్ సూచించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సత్కరించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని, పరేడ్ మైదానంలో ప్రోటోకాల్, వసతి, తాగునీటి సౌకర్యం, ప్రథమ చికిత్స కేంద్రం తదితర ఏర్పాట్లను గావించాలని ఖమ్మం ఆర్డీఓ, అర్బన్ తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలను అలరింపజేసే విధంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారిని ఆదేశించారు

Related Posts