YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

భారీ ఎత్తున మాదకద్రవ్యాలు స్వాధీనం

భారీ ఎత్తున మాదకద్రవ్యాలు స్వాధీనం

సంగారెడ్డి
గుట్టుచప్పుడు కాకుండా మత్తుమందు, మాదకద్రవ్యాలను  తయారు చేస్తూ విక్రయిస్తున్న ముఠాను ఎస్ ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 3కోట్ల రూపాయల విలువైన 14కేజీల ఆల్ఫ్రాజోలం ను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ రూపేష్ అన్నారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం  శివానగర్  కొడకంచి శివారు ప్రాంతంలో  డ్రగ్స్ తయారు  చేస్తున్న ప్రాంతాన్ని ఎస్ ఓ టి పోలీసులు. గుర్తించారు గత 6నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా   ఆల్ఫా జోలం, హేరైన్, కోకైన్, పలు రకాల డ్రగ్స్ ను తయారు చేస్తున్నట్లుగా పోలీసులకు విశ్వసనీయ సమాచారం. దీంతో  ఎస్ ఓ టి పోలీసులు అక్రమంగా  డ్రగ్స్ తయారుచేస్తున్న ప్రాంతంపై నిఘా పెట్టారు.అదునుచూసుకున్న పోలీసులు డ్రగ్ తయారీ కేంద్రంపై చాకచక్యంగా వ్యవహరించి 14 కిలోల ఆల్ప్రా జోలం ను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఓ బిఆర్ఎస్ జిల్లా నేత కనుసన్నల్లో ఈ డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్ తయారి కేంద్రం వద్ద ఐదుగురు నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Related Posts