ఆఫ్గనిస్తాన్ తో ఆడే టెస్ట్ మ్యాచ్ కి భారత ఆటగాడు వృద్ధిమాన్ సాహా దూరమయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు సాహా. టోర్నీలో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో సాహా చేతి వేలికి గాయమైంది. సాహాకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఐదు నుంచి ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు.ఈ నేపథ్యంలో సాహా అఫ్గానిస్థాన్‌తో టెస్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరు వారాల తర్వాత సాహా ఒకవేళ గాయం నుంచి కోలుకోకపోతే ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కూ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. దినేశ్ కార్తీక్ లేదా పార్ధివ్ పటేల్‌తో సాహా స్థానాన్ని బీసీసీఐ భర్తీ చేయనుంది.