YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సీఎం రేవంత్ రెడ్డి

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారి జన్మదినం తెలంగాణ ప్రజలకు ఒక పండుని టీపీసీసీ ఛీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం గాంధీ భవన్ లో జరిగిన సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో అయన పాల్గోన్నారు. రేవంత్ మాట్లాడుతూ డిసెంబర్ 9, 2019లో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ఉక్కు సంకల్పంతో సోనియమ్మ మన ఆకాంక్షలు నెరవేర్చారు. తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో.. మనం చూడలేదు. తెలంగాణ తల్లి సోనియమ్మ రూపంలో ఉంటుందని ఆ తల్లి మనకు భరోసా ఇచ్చిందని అన్నారు. తెలంగాణ ప్రజలు కృతజ్ఞత భావంతో ఉంటారని మొన్నటి ఎన్నికల తీర్పుతో నిరూపించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రజలు నాకు ఈ బాధ్యత ఇచ్చారు. సేవకుడిగా ప్రజలందరి ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత నాది. కార్యకర్తలకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఈ ప్రభుత్వం ప్రజలది.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన ఉంటుందని అన్నారు..

కాంగ్రెస్ ప్రభుత్వం  రాష్ట్ర ప్రజలకు అంకితం ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క

హైదరాబాద్ గాంధీభవన్లో జరిగిన సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే తదితరులు పాల్గోన్నారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం రోజున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన జరిగినందున డిసెంబర్ 9 (ఈరోజు) చాలా చారిత్రాత్మకమైన రోజు. యూపీఏ ప్రభుత్వం ఈ రోజునే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని ప్రజలు సంతృప్తిగా జీవించడానికి దశాబ్ద కాలం ఎదురు చూడాల్సి వచ్చిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోసం అద్భుతమైన తీర్పు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కి ప్రభుత్వ ఏర్పాటును కానుకగా ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం  రాష్ట్ర ప్రజలకు అంకితం
గాంధీభవన్ సాక్షిగా కాంగ్రెస్ సిద్ధాంతాలు, ప్రజల ఆశయాలు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తూ.చ తప్పకుండా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ ప్రజల కోసమే పనిచేస్తుంది. ప్రజల సంపదను ప్రజలకు పంచడానికి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో మహాలక్ష్మి పథకం అమలులో భాగంగా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. రాష్ట్ర మహిళలందరికీ ఈ సందర్భంగా నా ప్రత్యేక అభినందనలని అన్నారు

Related Posts