YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా 'సమ్మోహనం' ట్రైలర్..!!

కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా 'సమ్మోహనం' ట్రైలర్..!!

సుధీర్ బాబు అదితిరావు జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ  దర్శకత్వంలో 'సమ్మోహనం' అనే చిత్రం తెరకెక్కుతుంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా నిర్మితమైంది. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను జూన్ 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ లోగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఇటీవలె ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ట్రైలర్ తో మరింతగా అంచనాలను పెంచడానికి రెడీ అవుతున్నారు. ఈ నెల 31వ తేదీన సూపర్ స్టార్ కృష్ణగారి పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ రోజున ఉదయం 9 గంటల 18 నిమిషాలకి ఆయన చేతులమీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. వచ్చే నెల 15 న ఈ చిత్రం రిలీజ్ కానుంది.

Related Posts