ఈ మధ్యన ఎక్కువగా వింటున్నాను. ఇంత వయసొచ్చినా ఇంకా యంగ్‌గా కనిపిస్తున్నానని అంతా అంటున్నారు. ఆ ఏజ్ గురించి మానేయండయ్యా బాబు. ఐ యామ్ స్టిల్ యంగ్. ఇందాకే చైతన్య అన్నాడు కదా బ్రదర్ అని. గుర్తుపెట్టుకోండి. ఏజ్ గురించి అనడం మానేయండి’ అంటూ అక్కినేని నాగార్జున సరదాగా అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆఫీసర్’. రాంగోపాల్ వర్మ దర్శకుడు. నాగార్జున సరసన మైరా సరీన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా జూన్ 1న విడుదలవుతోంది. అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అక్కినేని హీరోలతో పాటు అమల, రాంగోపాల్ వర్మ, ఎం.ఎం.కీరవాణి, వై.వి.ఎస్.చౌదరి తదితరులు పాల్గొన్నారు. ‘ఆఫీసర్’ చిత్రం గురించి, రాంగోపాల్ వర్మ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘నాగార్జున గురించి మాట్లాడితే నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి’ అని వర్మ చెప్పిన మాటకు కింగ్ బదులిస్తూ.. ‘రాము నీ కళ్లలో నీళ్లు కూడా తిరుగుతాయా?’ అని నవ్వుతూనే ‘కనపడ్డాయి నాకు’ అన్నారు. ‘తెలుగు సినీ పరిశ్రమ ‘శివ’కు ముందు, తరవాత అని చాలా మంది అంటుంటారు. ‘శివ’ వర్మకు బ్రేక్ ఇస్తే.. నాకు అమలను ఇచ్చింది. ‘ఆఫీసర్’ సినిమా కోసం మంచి యంగ్ టీంతో కలసి పనిచేశాను. వాళ్లందరితో పనిచేస్తుంటే చాలా ముచ్చటేసింది. ఇంత మంచి యంగ్ టీంను నాకు పరిచయం చేసిన రాముకి థ్యాంక్స్. అందరూ వయసైపోంది అంటున్నారు. నాకు కూడా ఇది మంచి మార్పు’ అని సినిమా అనుభవాలను నాగార్జున చెప్పారు