YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గ్యాస్ కంపెనీల దగ్గర మహిళల క్యూ

గ్యాస్ కంపెనీల దగ్గర మహిళల క్యూ

హైదరాబాద్, డిసెంబర్ 13,
హైదరాబాద్ లోని గ్యాస్ ఏజెన్సీల వద్ద జనం బారులు తీరుతున్నారు. సిలిండర్ రూ.500కే అందిస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించడంతో సబ్సిడీ సిలిండర్ కోసం ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఇటీవలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ లను అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీనిచ్చింది.ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీ లను ప్రారంభించారు.అందులో ఒకటి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మరియు ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు....ఈ రెండు పథకాలను రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రారంభించారు.మిగిలిన నాలుగు గ్యారెంటీల్లో మరో కీలకమైన గ్యారంటీ రూ.500 లకే గ్యాస్ సిలిండర్ పథకం… ఎన్నికల ప్రచారంలో ఈ స్కీం ను కాంగ్రెస్ నేతలు బాగా వాడుకున్నారు. అధికారంలోకి రాగానే ఈ స్కీం అమలు చేస్తామని అభయం ఇచ్చారు. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రజల దృష్టి మరీ ముఖ్యంగా మహిళల దృష్టి అంతా ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల పై పడింది. ఈ క్రమంలోనే ఎలాగైనా సిలిండర్ దక్కించుకోవాలని హైదరాబాద్ ఎల్పీజీ పంపిణీ కేంద్రాలకు ప్రజలు క్యూలు కడుతున్నారు.హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్, భవాని నగర్,సంతోష్ నగర్, టోలిచౌకి, అల్వాల్, సనత్ నగర్,మలక్ పేట్ సహా నగరంలోని అనేక ప్రాంతాల ప్రజలు ఈకేవైసీల కోసం ఏజెన్సీల వద్ద బారులు తీరారు. ఇదిలా ఉంటే ఏజెన్సీల సిబ్బంది మాత్రం మహాలక్ష్మి పథకానికి ఈ కేవైసికి సంబంధం లేదని,మున్ముందు అవసరాలకు ఈకేవైసి చేయించడం మంచిదేనని చెబుతున్నారు.ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం,మెదక్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

Related Posts