విశాఖపట్నం
సామాజిక బస్సు యాత్ర పేరుతో ప్రయా ణిస్తున్న వాళ్ళు మంత్రులైతే తుఫాను వల్ల నష్టపో యిన రైతుల గోడు విన్నారా అని టిడిపి ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ వెంకన్న ప్రశ్నించారు. నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టకుండా బస్సు యాత్ర పేరుతో గ్రామాల్లోకి వెళ్లి దండుపాలెం గ్యాంగ్ లా మారారని ఏద్దేవా చేశారు. వాలంటీర్లను పంపించి బాధి రైతులను బెదిరించి మీటింగ్ లకు రావాలని ఒత్తిడి చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ వారి బాధలను పట్టిం చుకోకుండా బస్సు యాత్రలు చేస్తారా అని మండి పడ్డారు.టిడిపి అధికారంలో లేకపోయినా నష్టపోయిన రైతుల దగ్గరికి వెళ్లి చంద్రబాబు మాట్లాడారని, వారి సమస్యలను కేంద్రానికి తెలియపరిచారని అన్నారు. బాధితు లను పరామర్శించడానికి వారికి సమయం లేదని, సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణా రెడ్డి, సాయిరెడ్డి వంటి వారే బాగుపడ్డారని అన్నారు.