YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భారీగా పెరిగిన బంగారం ధరలు

భారీగా పెరిగిన బంగారం ధరలు

ముంబై, డిసెంబర్ 15,
వచ్చే ఏడాది వడ్డీ రేట్లు 75 బేసిస్‌ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని యూఎస్‌ ఫెడ్‌ చెప్పడంతో డాలర్‌, బాండ్‌ ఈల్డ్స్‌ నెత్తిన పిడుగుపడింది. దీంతో, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు భారీగా పెరిగింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,055 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ‍‌(22 కేరెట్లు) ధర 1,000 రూపాయలు, స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 1,090 రూపాయలు, 18 కేరెట్ల గోల్డ్ రేటు 820 రూపాయల చొప్పున పెరిగాయి. కిలో వెండి రేటు ₹ 2,500 పైకి చేరింది.హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹ 57,650 వద్దకు; 24 క్యారెట్ల బంగారం ధర ₹ 62,890 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 47,170 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 79,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.విజయవాడలో10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 57,650 వద్దకు; 24 క్యారెట్ల బంగారం ధర ₹ 62,890 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 47,170 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 79,500 గా ఉంది. విశాఖపట్నం  మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
చెన్నైలో  22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 58,200 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 63,490 కి చేరింది. కోయంబత్తూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
ముంబయిలో  22 క్యారెట్ల బంగారం ధర ₹ 57,650 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 62,890 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
దిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 57,800 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 63,040 గా నమోదైంది. జైపుర్‌, లఖ్‌నవూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కోల్‌కతా  22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 57,650 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 62,890 గా ఉంది. నాగ్‌పుర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
బెంగళూరులో  22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 57,650 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 62,890 గా ఉంది. మైసూరులోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కేరళలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 57,650 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 62,890 గా ఉంది. భవనేశ్వర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
దుబాయ్‌లో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 50,463.67 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,489.42 వద్దకు చేరింది. UAE, షార్జా,
మస్కట్‌లో  22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 52,360.09 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,740.09 వద్దకు చేరింది.  
కువైట్‌లో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 51,441.36 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,419.54 వద్దకు చేరింది.
మలేసియాలో  22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 53,249.92 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 56,108.97 వద్దకు చేరింది.
సింగపూర్‌లో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 51,866.33 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 57,629.26 వద్దకు చేరింది.
అమెరికాలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 50,806.90 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,971.40 వద్దకు చేరింది.
మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 210 పెరిగి ₹ 25,140 వద్ద ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ద్రవ్యోల్బణం, ప్రపంచ కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

Related Posts