YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీవారికి భారీ కానుక రెండు కోట్లతో సూర్యకఠారిని తయారు చేసిన తమిళ భక్తుడు. ఖడ్గం విలువ 2 కోట్లు ఉంటుందని టిటిడి అంచనా

శ్రీవారికి భారీ కానుక రెండు కోట్లతో సూర్యకఠారిని తయారు చేసిన తమిళ భక్తుడు. ఖడ్గం విలువ 2 కోట్లు ఉంటుందని టిటిడి అంచనా
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారికి తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు మంగళవారం నాడు  స్వర్ణసూర్య కఠారి ( బంగారు ఖడ్గ) ని కానుకగా సమర్పించారు. తమిళనాడు తేని జిల్లా బోడినాయకలూర్కు చెందిన పారిశ్రామికవేత్త తంగదొరై సుమారు రెండు కోట్లతో దాదాపు 6 కిలోల బరువున్న స్వర్ణసూర్య కఠారిని తయారుచేయించారు. కుమారుడు రఘుతో కలిసి తంగదొరై నిన్న తిరుమల చేరుకున్నారు. ఇవాల తెల్లవారుజామున సుప్రభాత సేవకు హాజరై స్వర్ణసూర్య కఠారిని టీటీడీ అధికారులకు ఆలయంలో అందజేశారు. 1989లో కర్ణాటక ముఖ్యమంత్రిగా వీరేంద్ర పాటిల్ ఉన్న సమయంలో ప్రభుత్వం తరఫున శ్రీవారికి స్వర్ణసూర్యకఠారిని సమర్పించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే శ్రీవారికి ఈ అతిపెద్ద భారీ కానుక అందింది. ఇంత పెద్ద మొత్తంలో విరాళంగా స్వామికి కానుక ఇచ్చిన దాతను టిటిడి సగౌరవంగా అభినందించి... స్వామి వారి దర్శనం ఏర్పాట్లు చేసి పంపారు.

Related Posts