హిందూపురం
పలు సమస్యల పరిష్కారానికై అంగన్వాడీలు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు జోరందుకున్నాయి. అంగన్వాడి కేంద్రాలకు తాళాలు పగలగొట్టి ఎంపీడీవోలు రెవెన్యూ సిబ్బంది వేరే తాళాలు వేయడం సమంజసం కాదని అంగన్వాడీలు హిందూపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.
శ్రీసత్య సాయి జిల్లా హిందూపురంలో అంగన్వాడీ కార్యకర్తలు పలు సమస్యలపై నిరసనలు తెలుపుతున్నారు. అంగనవాడి సిబ్బందిని బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించి అరెస్టు చేయడంతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు ఉన్న తాళాలను పగలగొట్టి ఎంపీడీవో, కమిషనర్లు వేరే తాళాలు వేశారు. దీంతో ఆగ్రహించిన అంగన్వాడి వర్కర్లు హిందూపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడి కార్యకర్తలు నినాదాలు చేశారు.