YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కర్నూలు జిల్లాలో మరో చోట బంగారు గనులు

కర్నూలు జిల్లాలో మరో చోట బంగారు గనులు

కర్నూలు
కర్నూలు జిల్లాలో మరో చోట బంగారు గనులు ఉన్నట్లు శాస్త్ర వేత్తలు గుర్తించారు. ఆలూరు సెగ్మెంట్ లోని అస్పరి మండల పరిధిలో గోల్డ్ నిక్షేపాలున్నట్లు..జీఎస్.ఐ..జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండయా ప్రాథమికంగా గుర్తించారు.
ఈ ప్రాంతంలో బంగారు ఖనిజ నిల్వ పరిమాణం, నాణ్యత, విస్తీర్ణం పై సమగ్ర సర్వే చేయాలని జీ.ఎస్.ఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పత్తికొండ సెగ్మెంట్ పరిధిలోని తుగ్గలి మండలంలో బంగారు గనులపై  తవ్వకాలు చేస్తోంది జీఎస్ఐ.. ఆస్పరి లో గోల్డ్ నిక్షేపాలపై సర్వే వివరాలను జిల్లా మైనింగ్ అధికారులకు జీఎస్ఐ అధికారులు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లోనే ఈ సర్వే ను పూర్తి చేయాలని జీఎస్ఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది..

Related Posts