YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అద్దంకి సీటు..మా కొద్దు..

అద్దంకి సీటు..మా కొద్దు..

ఒంగోలు, డిసెంబర్ 21,
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజక వర్గంలో బలమైన అభ్యర్ధిని దింపాలని భావించిన వైఎస్సార్సీపీ అధిష్టానం ఆ స్థానానికి శిద్దా రాఘవరావు కుమారుడి పేరును పరిశీలించింది.2014లో దర్శి నుంచి పోటీ చేసి గెలిచిన శిద్దా రాఘవరావు ఆ తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత శిద్దా కుటుంబం కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మంత్రి బాలినేని ద్వారా వైసీపీలో చేరిపోయారు. దర్శి నుంచి శిద్దా రాఘవరావు కుమారుడు టిక్కెట్ ఆశిస్తున్నారు. దర్శిలో వైసీపీ తరపున మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2009, 2014,2019 ఎన్నికల్లో అద్దింకి నుంచి గొట్టి పాటి రవికుమార్ వరుసగా మూడుసార్లు గెలిచారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్‌ 2014లో వైసీపీ నుంచి గెలిచారు. 2014లో గెలిచిన తర్వాత టీడీపీలో చేరిన 23 మంది ఎమ్మల్యేల్లో గొట్టిపాటి కూడా ఉన్నారు. అయితే 2019లో వారిలో గొట్టి పాటి ఒక్కరే విజయం సాధించారు.గొట్టిపాటి వైసీపీని వీడిన తర్వాత అద్దంకిలో బలమైన అభ్యర్థిని నిలిపేందుకు నిలిపేందుకు వైసీపీ బలమైన అభ్యర్థి కోసం అన్వేషించింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన బాచిన చెంచు గరటయ్యను 2019లో వైసీపీ అభ్యర్ధిగా నిలిపింది. గరటయ్య1983, 85, 94,99లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన గరటయ్యపై గొట్టిపాటి రవికుమార్‌ 12,991ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అద్దంకి నియోజక వర్గానికి ఇన్‌ఛార్జిగా బాచిన చెంచు గరటయ్య కుమారుడు కృష్ణ చైతన్యకు బాధ్యతలు అప్పగించారు. కృష్ణ చైతన్యపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడం, నియోజక వర్గంలో బలమైన గొట్టిపాటి రవికుమార్‌ను ఢీకొట్టే అవకాశాలు లేకపోవడంతో ప్రత్యామ్నయంపై వైసీపీ దృష్టి సారించింది. దీంతో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కుమారుడు శిద్దా సుధీర్‌ను బరిలోకి దింపాలని భావించింది. అద్దంకి నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదని గ్రహించిన శిద్దా కుటుంబం వైసీపీ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించింది.దర్శిలో తప్ప తాము మరో చోట పోటీ చేయలేమని తేల్చి చెప్పింది. స్థాన బలం లేకుండా పోటీ చేసి ఓటమి మూటగట్టుకోవడం కంటే పోటీ నుంచి తప్పుకోవడం మేలని శిద్దా ఫ్యామిలీ భావించింది. 11నియోజక వర్గాలకు మార్పులు చేర్పులను ప్రకటిస్తున్న సమయంలో వారిని సంప్రదించినా పోటీకి విముఖత చూపినట్టు తెలుస్తోంది. దీంతో వైవీ సుబ్బారెడ్డికి సన్నిహితుడైన హనిమిరెడ్డిని ఎంపిక చేసింది. టెలికాం కాంట్రాక్టర్‌గా గుర్తంపు పొందిన హనిమిరెడ్డికి వైవీ సుబ్బారెడ్డితో దగ్గరి సంబంధాలు ఉండటంతో అతని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

Related Posts