YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో బీజేపీనే ఆప్షనా.....?

ఏపీలో బీజేపీనే ఆప్షనా.....?

విజయవాడ, డిసెంబర్ 21,
మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరుతో బిజెపిలో ఒక రకమైన అనుమానం ప్రారంభమైంది. అది పొత్తులపై ప్రభావం చూపుతోంది. జాతీయస్థాయిలో తనకు బద్ధ విరోధి అయిన కాంగ్రెస్ పార్టీకి టిడిపి శ్రేణులు సపోర్టు చేయడం ఏమిటని బిజెపి హై కమాండ్ ఆగ్రహంగా ఉంది.ఏపీలో అధికార పక్షం దూకుడుగా ఉంది. ఎన్నికల వ్యూహాలను రూపొందించుకుంటుంది. బలమైన అభ్యర్థులను బరిలో దించాలని కసరత్తు చేస్తోంది. అటు తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఉమ్మడి కార్యాచరణ ప్రారంభించాయి. పాదయాత్రకు సంబంధించి విజయోత్సవ సభలో చంద్రబాబుతో పాటు పవన్ హాజరై పొత్తులపై కీలక ప్రకటనలు చేశారు. ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. అయితే సీట్ల సర్దుబాటుకు సంబంధించి కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. బిజెపి తమతో కలిసి వస్తుందని.. అందుకు అనుగుణంగా సీట్ల సర్దుబాటు చేసుకోవచ్చని ఆ రెండు పార్టీలు భావించాయి. బిజెపి వస్తుందని కొండంత ఆశతో ఉన్నాయి. కానీ ఆ పార్టీ రాష్ట్ర నాయకుల ప్రకటనలు చూస్తుంటే మాత్రం అది అంత ఈజీ కాదని తేలుతోంది.మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరుతో బిజెపిలో ఒక రకమైన అనుమానం ప్రారంభమైంది. అది పొత్తులపై ప్రభావం చూపుతోంది. జాతీయస్థాయిలో తనకు బద్ధ విరోధి అయిన కాంగ్రెస్ పార్టీకి టిడిపి శ్రేణులు సపోర్టు చేయడం ఏమిటని బిజెపి హై కమాండ్ ఆగ్రహంగా ఉంది. అయితే బిజెపి రాష్ట్ర నాయకులు మాత్రం టిడిపి తో కలిసి వెళ్లాలని అభిప్రాయపడుతున్నారు. హై కమాండ్ నుంచి మాత్రం ఆ దిశగా ఎటువంటి సంకేతాలు రావడం లేదు. అక్కడి నుంచి సానుకూల ఆదేశాలు వస్తే ఇక్కడ బిజెపి నాయకులు.. సానుకూల ప్రకటనలు చేసే అవకాశం ఉంది.బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఎటువంటి ప్రకటన చేయకున్నా.. కొంతమంది మాత్రం తాము టిడిపితో కలిసి వెళ్లేది లేదని తేల్చి చెబుతున్నారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ బలంగా ఉందని.. సానుకూల ఫలితాలను సాధిస్తుందని గుర్తు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీ మరోసారి తిరుగులేని విజయం సాధించనున్నారని.. ముచ్చటగా మూడోసారి ఈ దేశానికి ప్రధాని కానున్నారని బిజెపి నేతలు సగర్వంగా చెబుతున్నారు. దాదాపు ఉత్తరాది రాష్ట్రాలన్నీ బిజెపి ఏలుబడిలోకి వచ్చాయని.. తాము ఒకరికి ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నామని.. ఒకరి ఇచ్చే సీట్లు తీసుకునే పొజిషన్లో లేమని తేల్చి చెబుతున్నారు. తద్వారా ఏపీలో ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నారు.అయితే బిజెపికి వేరే ఆప్షన్ లేదని.. తమకూటమి వైపు రాక తప్పదని టిడిపి, జనసేన అంచనా వేస్తున్నాయి. తాజా పరిణామాలు చంద్రబాబుకు నిరాశ కలిగిస్తున్నాయి. బిజెపి ద్వారా వైసీపీని కట్టడి చేసి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు భావించారు. కానీ బిజెపి ఆలోచన మరోలా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts