బీజాపూర్
భారత్ బంద్ కు ముందు మావోయిస్టులు మూడు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఆంధ్రప్రదేశ్ లోని ఛట్టి, సుక్మాలోని కొంటా ప్రాంతంలో కాల్పులు. చోటు చేసుకున్నాయి. కొంట బీజేపీ నేత సుభాష్ చతుర్వేది వాహనంపై రాళ్ల దాడి జరిపారు.
బీజాపూర్ జిల్లా భైరామ్గఢ్-బీజాపూర్ మధ్య రహదారిపై చెట్లను నరికి అడ్డుగా వేసారు. బెల్చర్ సమీపంలో జాతీయ రహదారిపై ఘటన జరిగింది. దాంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. బస్సులు, వాహానాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. జాతీయ రహదారిపై మావోయిస్టులు బ్యానర్లు, కరపత్రాలు వదిలిపెట్టారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో రెండు ట్రక్కులను, ఆంధ్రఆర్టీసీ బస్సును దగ్ధం చేసారు.
చింతూరు మండలానికి సరిహద్దును గల ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో రాత్రి సుమారు 7:30 గంటలకు జగదల్పూర్ నుండి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సును( ఆసీర్ గూడెం) గ్రామo వద్ద మావోయిస్టులు నిలిపివేసి దగ్ధం చేశారు. అలాగే మరో రెండు ట్రక్కులను డీజిల్ పోసి దగ్ధం చేసారు.