YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

అన్ క్లెయిమ్డ్ మనీ 15 వేల కోట్లు

అన్ క్లెయిమ్డ్ మనీ 15 వేల కోట్లు

ముంబై, డిసెంబర్ 21,
దేశంలోని ప్రతి వ్యక్తిని ఆర్థిక వ్యవస్థలో భాగం చేయడంతో పాటు, ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడానికి భారత ప్రభుత్వం జన్ ధన్ యోజన ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రారంభించిన బ్యాంక్‌ ఖాతాలు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ స్కీమ్ విజయవంతంలో కీలక పాత్ర పోషించాయి. ప్రస్తుతం, భారతదేశంలో 51 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు  ఉన్నట్లు భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... వీటిలో దాదాపు 20 శాతం అకౌంట్లు/10 కోట్లకు పైగా ఖాతాలు మూతబడ్డాయి. ఇవి మూతబడింది డబ్బు లేక మాత్రం కాదు. ఈ 10 కోట్ల ఖాతాల్లో రూ.12,779 కోట్లు పడి ఉన్నాయి. ఈ మొత్తాన్ని ఎవరూ క్లెయిమ్ చేయడం లేదు అంటే, ఆ డబ్బు మాదేనని ఎవరూ ముందుకు రావడం లేదు. దేశంలో దాదాపు 51.11 కోట్ల పీఎం జన్‌ధన్ ఖాతాలు ఉన్నాయని, పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో , ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ రాజ్యసభకు వెల్లడించారు. వీటిలో 4.93 కోట్ల ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయి. బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం, 2023 డిసెంబర్ 6వ తేదీ వరకు, వివిధ బ్యాంకుల్లో మొత్తం 10.34 కోట్ల ఖాతాలు నిష్క్రియంగా మారాయని చెప్పారు.రూ.12,779 కోట్లు ఇప్పటికీ క్రియారహిత జన్ ధన్ ఖాతాల్లోనే ‍‌ ఉన్నాయి. ఈ ఖాతాల్లో ఉన్న మొత్తం డిపాజిట్స్‌లో ఇది దాదాపు 6.12 శాతానికి సమానం. క్లోజ్డ్ అకౌంట్లలోని డబ్బుపై ఎప్పటికప్పుడు వడ్డీ కూడా జమ అవుతోంది. ఇలాంటి ఖాతాల సంఖ్యను తగ్గించేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయని, భారత ప్రభుత్వం కూడా పర్యవేక్షిస్తోందని భగవత్ కరాద్ చెప్పారు.జన్ ధన్ ఖాతాల్లో 55.5 శాతం మహిళలవేనని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ట్వీట్‌ చేసింది. 2023 నవంబర్ 22 వరకు, ఈ ఖాతాల్లో రూ.2.10 లక్షల కోట్లు జమ అయ్యాయి. 4.30 కోట్ల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లేదు. జన్ ధన్ ఖాతాల్లో కనీస మొత్తం ఉంచాల్సిన అవసరం లేదు.2023 మార్చి నాటికి, ఇన్‌యాక్టివ్‌గా ఉన్న బ్యాంక్‌ ఖాతాల్లో దాదాపు రూ.42,270 కోట్లు పడి ఉన్నాయని కరాద్ గతంలో పార్లమెంటుకు తెలిపారు. క్రితం ఏడాది ఈ సంఖ్య రూ.32,934 కోట్లుగా ఉంది. ఈ ఖాతాల యజమానులను గుర్తించేందుకు ఆర్‌బీఐ చాలా చర్యలు చేపట్టిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి వెల్లడించారు. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు పని చేయని ఖాతాల్లోని మొత్తం డబ్బు 'డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌'లో జమ చేస్తారు.RBI రిపోర్ట్‌ ప్రకారం... తమిళనాడు, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్, కర్ణాటక, బిహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని బ్యాంకుల్లో ఇలాంటి అన్‌క్లెయిమ్డ్‌ మనీ ఎక్కువగా డిపాజిట్ అయింది.

Related Posts