ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశ జిడిపి పడిపోయిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళవారం నాడు మహానాడు ప్రాంగణం వద్ద తనను కలిసిన విలేకరులతో లోకేశ్ మాట్లాడారు. సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడే దేశ జిడిపి మెరుగ్గా ఉండేదని ఆయన చెప్పారు. దేశంలో కాంగ్రెస్, బిజెపియేతర పక్షాలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని లోకేశ్ అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన మోడీని విమర్శించని వైసీపీ బీజేపీకి మద్దతు పలికినట్టే.వైసీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని అయన అన్నారు. కులాలు, మకాల మధ్య చిచ్చు పెడతారని మేం మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. ప్రజలను కన్విన్స్ చేయలేక కన్ఫ్యూజ్ చేస్తున్నారని అయన విమర్శించారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందనగానే వైసీపీ కార్యకర్తలు టపాసులు కాల్చారు.. ఆ తర్వాత డీలా పడ్డారు. వచ్చే ఎన్నికల్లో దేశ రాజకీయాల్లో టీడీపీ పాత్ర ఎలా ఉండబోతోందో మీరే చూస్తారు. ఉద్దానంలో ప్రభుత్వం అసలేం చేయనట్టు మాట్లాడ్డం పవనుకు తగదు. గతానికంటే మెరుగ్గా ఉద్దానం సమస్యలను పరిష్కరించామని అన్నారు.