YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మల్కాజ్ గిరి సీటుపై గురి

మల్కాజ్ గిరి  సీటుపై గురి

హైదరాబాద్, డిసెంబర్ 22,
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత సీటు హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ లో పోటీ చేసిన ఈటల రాజేందర్ రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి? అన్న అంశం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. మరో మూడు నెలల్లో జరిగే ఎంపీ ఎన్నికల్లో ఈటల పోటీ చేయడం ఖాయమన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది. దీంతో.. అయిన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అన్న అంశం చర్చనియాంశమైంది. మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసేందుకు ఈటల సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. అదే సీటును పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు సైతం ఆశిస్తున్నారు.దీంతో మురళీధర్ రావును మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ కు పంపి మల్కాజ్ గిరి సీటు తనకు ఇవ్వాలని హై కమాండ్ ను కోరడానికి ఈటల సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో బీజేపీ మంచి ఓటు బ్యాంక్ సాధించింది. కార్పొరేటర్లు సంఖ్య కూడా ఈ ఎంపీ స్థానంలో బీజేపీకి ఎక్కువగానే ఉంది. దీంతో సొంత ఇమేజ్ తో పాటు పార్టీ బలం తోడు అయితే ఇక్కడ ఈజీ గా గెలవచ్చు అనే అంచనాల్లో ఈటల ఉన్నారు.మల్కాజ్ గిరి టికెట్ ఇవ్వని పక్షంలో జహీరాబాద్ లేదా మెదక్ ఎంపీ సీటు డిమాండ్ చేసే యోచనలో ఈటల రాజేందర్ ఉన్నారు. అయితే.. మెదక్ నుంచి పోటీకి సిద్ధమని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇప్పటికే ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. ఎంపీ ఎన్నికల నాటికి సత్తా చాటుతామన్న భావనలో బీజేపీ ఉంది. మోదీ ఇమేజ్ తమకు కలిసి వస్తుందని వారు లెక్కలు వేసుకుంటున్నారు.

Related Posts