YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీవారి ఆలయం లో వైకుంఠ ఏకాదశి వేడుకలు

శ్రీవారి ఆలయం లో వైకుంఠ ఏకాదశి వేడుకలు

తిరుమల
శనివారం   తెల్లవారు జామున1:30 నిమిషాలకు శ్రీవారికి విశిష్ట కైంకర్యాల అనంతరం 1:45 నుండి విఐపీలకు దర్శనం కల్పించామని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి వెల్లడించారు.  దాదాపు 4 వేల మంది పలు రాష్ట్రాల నుండి వివిధ రంగాల్లో ఉన్న వారు తిరుమల కి రావడం జరిగింది. వాళ్లకు అందరికీ స్వామి వారి దర్శనం, వైకుంఠ ద్వారాల దర్శనం చేయించడం జరిగింది.  సామాన్య భక్తులకు ఇచ్చిన షెడ్యూల్ ముందే ఆలయంలో స్వామి దర్శనం ప్రారంభించాం. ఏ ఒక్క సామాన్య భక్తులకు వైకుంఠంలో ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం.  వైకుంఠ ద్వారాలు 10 రోజులు తెరిచే ఉంచుతాం.  భక్తులు ఎవరూ ఆందోళన చెందాల్చిన అవసరం లేదని అన్నారు.

వైకుంఠ ఏకాదశి...
తిరుమలలో విఐపీల హడావుడి తిరుమల కొండకు క్యూ కట్టిన ప్రముఖులు శ్రీవారి ని దర్శించుకున్న వారిలో రాజకీయ, సినీ ప్రముఖులు
తిరుమల శ్రీవారిని వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలువురు ప్రముఖులు దర్శించు కున్నారు. ఏకాదశి పురస్కరించుకొని పెద్ద ఎత్తున విఐపీలు తిరుమల కి వచ్చారు. ఇందులో ప్రదానంగా ఏపీ హైకోర్టు జడ్జి సుజాత, ఏపీ హైకోర్టు జడ్జి శ్రీనివాస్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిధున్ రెడ్డి, ఏపీ హైకోర్టు జడ్జి రవీంద్రబాబు, ఏపీ హైకోర్టు జడ్జి సుబ్బారెడ్డి, డిప్యూటీ సిఎం నారాయణస్వామి, సీఎం రమేష్, ఐ టి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, బండ్ల గణేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి విస్వరూఫ్, స్పీకర్ తమ్మినేని సీతారాం, బి సి వెల్ఫేర్ & ఐ &పి ఆర్ మినిస్టర్ చెల్లుబోయున వేణుగోపాల కృష్ణ, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, మినిస్టర్ ఉషశ్రీ చరణ్, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మినిస్టర్ ఆదిమూలం సురేష్, ఏపీ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా, మినిస్టర్ మెరుగు నాగార్జున, మత్స్య కార శాఖ మంత్రి సిదిరి అప్పల రాజు దర్శించు కున్నారు.

Related Posts