ఏలూరు
ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్తర ద్వారం గుండా చిన వెంకన్నను భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం గోవింద నామ స్మరణలతో మరుమోగింది. ఉచిత దర్శనం, రూ.100, రూ.200, రూ.500 టికెట్లకు ప్రత్యేక క్యూ లైన్లు, గోవింద స్వాములకు, గ్రామస్తులకు మరో ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేసారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసింది.
అరసవల్లిలో ఉత్సవమూర్తుల తిరువీధి
శ్రీకాకుళం జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఉత్తరద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు.ముందుగా ఉత్సవ మూర్తులను అశ్వవాహనం పై ఉంచి తిరువీధి నిర్వహించారు.మాడవీధుల్లో ఊరేగించిన అనంతరం ఉత్సవ మూర్తులను ఆలయ ఉత్తర మండపంలో ఉంచి భక్తులకు దర్శనం కల్పించారు..