న్యూఢిల్లీ,డిసెంబర్ 23,
లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ తన నినాదాన్ని సిద్ధం చేసింది. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల కోసం ‘మేం నేస్తం వాస్తవమే, కలలు కాదు, అందుకే అందరూ మోదీని ఎన్నుకుంటారు’ అనే నినాదాన్ని ఆ పార్టీ రూపొందించింది. లోక్‌సభ ఎన్నికల సన్నాహకానికి సంబంధించి శుక్రవారం నుంచి ఢిల్లీలో రెండు రోజులపాటు పార్టీ ముఖ్యనేతల సమావేశం ప్రారంభం కానున్న తరుణంలో బీజేపీ ఈ నినాదాన్ని ఎంచుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో జరగుతున్న ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు నేతలు ఇందులో పాల్గొంటారు.ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో గడవు కంటే ముందే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. నెల రోజుల ముందుగానే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయంతో జోరు మీదున్న బీజేపీ లోక్‌సభ ఎన్నికలను ముందుగా నిర్వహించాలని భావిస్తోంది. ఫిబ్రవరి నెల 20వతేదీ లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి, మార్చి 7 నుంచి పది దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ యోచిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.ఈ సమావేశంలో వికాస్ భారత్ సంకల్ప్ అభియాన్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. నిజానికి హిందీ మాట్లాడే రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో బీజేపీ పెద్ద విజయం సాధించింది. తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం దక్కింది. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఈ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా భావించారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో, లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించకముందే భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థులను ప్రకటించడం ప్రారంభిస్తుంది. జనవరి చివరి వారంలో మొదటి జాబితా వచ్చే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న రామ్‌లల్లా దీక్ష తర్వాత బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.ప్రధాని మోదీ నేతృత్వంలో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ రెండుసార్లు సొంతంగా మెజారిటీ సాధించింది. 2014లో ఆ పార్టీ ‘అచ్ఛే దిన్ ఆనే వాలే హై’ అనే నినాదాన్ని ఇచ్చింది. కాగా 2019లో మరోసారి మోదీ ప్రభుత్వం అంటూ బీజేపీ నినాదాలు చేసింది. బీజేపీ కొత్త నినాదాలతో జనంలోకి వెళ్లాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ‘కలలు కావు వాస్తవం, అందుకే ఈసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తుందనే ఆశతో అందరూ మోదీని ఎంచుకుంటున్నారు’ అనే నినాదంతో ప్రచారంలో వెళ్ళాలని భావిస్తోంది. ప్రజలు తనను మళ్లీ ఎన్నుకుంటారని ప్రధాని నరేంద్ర మోదీ కూడా చాలా సందర్భాలలో ధీమా వ్యక్తం చేశారు.ఇక ఢిల్లీలో రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు . ఇందులో పార్టీ జాతీయ అధికారి, రాష్ట్ర ఇన్‌చార్జ్, కో-ఇన్‌చార్జ్, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హాజరుకానున్నారు. ఈ సమావేశానికి బీజేపీ అన్ని పార్టీ విభాగాల జాతీయ అధ్యక్షులు కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై సమీక్షించనున్నారు. వికాస్ భారత్ సంకల్ప్ అభియాన్, రాబోయే లోక్‌సభ ఎన్నికల సన్నాహాలకు సంబంధించి సమీక్ష నిర్వహించనున్నారు.ఎన్నికైన ప్రతినిధుల శిక్షణ, విస్తరణ ప్రణాళిక, కాల్ సెంటర్, మోర్చా కార్యకలాపాలపై కూడా సమావేశంలో చర్చ జరుగుతుంది. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల వరకు మూడు రాష్ట్రాల్లో బంపర్ విజయం సాధించిన ఉత్సాహాన్ని ఆ పార్టీ కొనసాగించాలన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా రామ మందిరానికి సంబంధించిన కార్యక్రమాలతో పాటు పలు కార్యక్రమాలను నిర్వహించి, కార్యకర్తలను రంగంలోకి దింపాలని బీజేపీ భావిస్తోంది.