బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ కి జిమ్ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం ఓ అందమైన అమ్మాయిని చూసి అక్కడికి వచ్చే కస్టమర్లు షాకయ్యారు. ఎందుకంటే ఆ రిసెప్షనిస్ట్ ఎవరో కాదు.. అలనాటి తార శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్. జాన్వి కూడా కత్రినా జిమ్‌లోనే కసరత్తులు చేస్తుంటుంది. కత్రినా జిమ్‌కి వెళ్లినప్పుడు అక్కడి రిసెప్షన్‌లోని కుర్చీలో జాన్వి కూర్చుని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ అచ్చం రిసెప్షనిస్ట్‌గా వ్యవహరిస్తుండడం కత్రినా కంటపడింది. దాంతో కత్రినా వెంటనే జాన్వి ఫొటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.