YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

‘వ్యూహం’ సినిమా సీబీఎఫ్సీ సర్టిఫికేట్ హైకోర్టు రద్దు చేయలేదు రాంగోపాల్ వర్మ

‘వ్యూహం’ సినిమా సీబీఎఫ్సీ సర్టిఫికేట్ హైకోర్టు రద్దు చేయలేదు రాంగోపాల్ వర్మ

హైదరాబాద్
వ్యూహం’ సినిమా సీబీఎఫ్సీ సర్టిఫికేట్ హైకోర్టు రద్దు చేయలేదు. జనవరి 11వరకు సీబీఎఫ్సీ ని సంబంధిత వివరాలు సమర్పించమని హైకోర్ట్ ఆదేశించిందని దర్శకుడు రాంగోపాల్ వర్మ  వివరించారు. తదుపరి విచారణ జనవరి 11 కు హైకోర్టు వాయిదా వేసింది.  ‘వ్యూహం’కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) జారీని  తెలగుదేశం పార్టీ రద్దు చేయమని కోరింది. పార్టీ జెండాలు, నేతల పేర్లతో చిత్రం తీశారని, ఇది పలు పార్టీల నేతల పరువు నష్టం కలిగించేదిగా ఉందని పిటిషనర్ తరఫున న్యాయవాది మురళీధర్రావు వాదించారు. నిర్మాత-దర్శకుడి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. రిట్ పిటిషన్ మెయింటెనబుల్ కాదు. ప్రజాప్రతినిధ్య చట్టంలోని సెక్షాన్ 29(ఏ) ప్రకారం ఈ పిటిషన్ వేసే అర్హత పిటిషనర్కు లేదు. ఎవరి పరువుకు నష్టం కలుగుతుందని భావిస్తే.. వారే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి.  చిత్రం చూడకుండానే పరువుకు నష్టం వాటిల్లుతుందని.. ఊహించి పిటిషన్ వేయడం ఆక్షేపణీయం. గతంలో సైరా నరసింహారెడ్డి చిత్రంపై కొందరు ఇదే హైకోర్టును ఆశ్రయించారని గుర్తు చేసారు.
చిత్రం చూడకుండానే ఆరోపణలు చేయడం సరికాదంటూ పిటిషన్ను ద్వి సభ్య ధర్మాసనం గతంలో కొట్టివేసింది. నిపుణులతో కూడిన కమిటీ కూర్చొని చిత్రాన్ని చూసి ఏకగ్రీవంగా సర్టిఫికెట్ జారీ చేసింది.   వ్యక్తులను, పార్టీలను కించపరిచే విధంగా ఉంటే సివిల్ కోర్టులో వారు పరువు నష్టం దావా వేసుకోవాలని అన్నారు.
హైకోర్టులో వేయడం తప్పుబట్టాల్సిన అంశం పిటిషన్ను కొట్టివేయాలి అని వాదనలు సీబీఎఫ్సీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ వినిపించారు. సినిమాటోగ్రాఫ్ చట్టం, ఫిల్మ్ సర్టిఫికేషన్ మార్గదర్శకాలు, ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం భావ ప్రకటన హక్కును పరిగణనలోకి తీసుకుని రివైజింగ్ కమిటీ ఏకగ్రీవంగా 'యు' సర్టిఫికెట్ మంజూరు చేసిందని కోర్టు కు తెలిపారు జనవరి11 న విచారణ ఉంటుందని మాత్రమే  హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని అయన అన్నారు.

Related Posts