YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హెరిటేజ్ లో చంద్రబాబు బ్లాక్ మనీ : మోత్కుపల్లి నర్సింహులు

హెరిటేజ్ లో చంద్రబాబు బ్లాక్ మనీ : మోత్కుపల్లి నర్సింహులు
చంద్రబాబు నాయుడు ఏన్టీఆర్  గొంతుకోసినట్లే నా గొంతు కోసారు. ఊరితీసేముందు అయినా చివరికోరిక అడుగుతారు...కాని నన్ను బహిష్కరించేముందు నన్ను కనీసం అడగలేదని టీటీడీపీ బహిషృత నేత మోత్కుపల్లి నర్సింహులు అవేదన వ్యక్తం చేసారు. మంగళవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సొమ్మును దోచుకోవడంలో బాబు బిజీగా ఉన్నారు. ఏన్టీఆర్ నిన్ను ఏప్పుడో పార్టీ నుండి సస్పెండ్ చేసారు..ఇంకా పార్టీ లో ఉండడానికి సిగ్గులేదా అని అన్నారు. రాజకీయాల్లో బాబు అంత నీతి మాలిన వ్యక్తి మరోకడులేడు..బాబు బతుకే కుట్రలు ,కుతంత్రాలతో కూడిఉందని అన్నారు. గాలి ముద్దుకృష్ణనాయుడు చనిపోవడం కు బాబే కారణం ఆయనను మానసికంగా ఇబ్బంది పెట్టారు. బాబు దగ్గర నేను ఏం ఆశించలేదు..గతంలో ప్రభుత్వం లేకపాయే. గవర్నర్ పదవి ఇవ్వమని నేను అడిగానా....రాజ్యసభ సీటు ఇస్తా అని నువ్వే చెప్పి గరికపాటి కి డబ్బులకు అమ్ముకున్నవని ఆరోపించారు. గవర్నర్ పదవి నీకు ఇవ్వలేక పోయాం అని కనీసం  ఓక్క సారైనా మాట్లాడావా. ఏన్టీఆర్ కుటుంబాన్ని అమాయకులను చేసి  గుంజుకొని పెత్తనం చెస్తానవని అన్నారు. మగాడివైతే జగన్ ,పవన్ కళ్యాణ్, కేసీఆర్ లా సొంత జెండా తో ఏన్నికల్లో గెలువాలని అన్నారు. తెలంగాణ ఉద్యమసమయంలో  నేను లేకపోతే ఇంటి నుంచి బయటకు రాని పిరికిపంద బాబు. ఓటుకు నోటు కేసులో దొంగను పట్టుకున్నట్లు పట్టుకున్నారని అన్నారు. కేసీఆర్ గురించి మాట్లాడేందుకు ఏందుకు వణుకుతున్నవని ప్రశ్నించారు.  కేసీఆర్ బయంతోనే అమరావతి కి పోయిండు. రేవంత్ ను కాంగ్రెస్ కు పంపించింది బాబే.రేవంత్ రెడ్డి ఎంతోమంది ని బెదిరించి బబ్బులు తీసుకున్నా ...అప్పుడు ఏంధుకు యాక్షన్ తీసుకోలేదని అన్నారు. రేవంత్ రెడ్డి ని తిట్టొద్దని టీ టీడీపీ నేతకు బాబు చెప్పాడు. నువ్వు నన్ను సస్పెండ్ చేసేది ఏంది ..తెలంగాణ ప్రజలు ఏన్నడొ నిన్ను సస్పెండ్ చేసారని అన్నారు. మోడి దగ్గరకు బాబు పోయింది.. అమరావతి అబివృద్ది కోసం కాదు..ఓటు కు నోటు కేసు నుండి తప్పించుకు నేందుకని మోత్కుపల్లి అన్నారు. 
 జగన్ ,పవన్ కళ్యాణ్ లు ప్రత్యేక హోదా తెస్తరు. ఏన్టీఆర్ కు భారతరత్న కూడా ఇప్పించలేకపోయినవ్. దేశంలో అన్ని కంపెనీ లకు నష్టాలు వస్తే నీ హెరిటేజ్ కంపెనీ మాత్రం లాభాలల్ల ఏలాఉంది..బ్లాక్ మనీ మొత్తం హెరిటేజ్ లో పెడుతుండని అయన అన్నారు.

Related Posts