YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అయోధ్య రాముడి తలుపులు హైదరాబాద్ వే

అయోధ్య రాముడి తలుపులు హైదరాబాద్ వే

హైదరాబాద్, డిసెంబర్ 29,
అయోధ్య రామయ్య'  ఆలయం నిర్మాణంలో మన తెలంగాణ  కీర్తి  శాశ్వతంగా కనిపించబోతోంది. రామయ్య ఆలయానికి సంబంధించిన తలుపులు, ద్వారాలను అందించే మహద్భాగ్యం మన 'భాగ్య'నగరానికి దక్కింది. బంగారు పూతతో 18 ప్రధాన ద్వారాలు, 100 తలుపులు అయోధ్య కోసం సుందరంగా, శరవేగంగా తీర్చిదిద్దుతున్నారు. గతంలో తమిళనాడుకు చెందిన 70 మంది అధికారుల బృందం దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించి అక్కడ పలు కళాకృతులను, శిలల వైభవాన్ని పరిశీలించింది. ఈ బృందం తెలంగాణలోని యాదాద్రి ఆలయాన్ని రెండు రోజులు నిశితంగా పరిశీలించింది. ఇక్కడి కళాకృతులకు ఫిదా అయినా బృంద సభ్యులు వీటి తయారీ గురించి ఆరా తీశారు. వాటిని హైదరాబాద్ బోయిన్పల్లిలోని  అనురాధ టింబర్ డిపోలో తయారు చేసినట్లు తెలుసుకుని దాన్ని సందర్శించారు. ఈ క్రమంలో 'అయోధ్య' ఆలయ ద్వారాలు, తలుపుల తయారీకి సంబంధించిన బృహత్తర ప్రాజెక్టును అప్పగించారు. 'రామయ్య' ఆలయానికి తలుపులు అందించే భాగ్యం దక్కడంపై ఆధాత్మికవేత్తలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కళా కీర్తి ఈ ఆలయంలో ప్రతిబింబిస్తుందని తెలిపారు. యాదాద్రి నారసింహుడే ఈ భాగ్యం అందించాడని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తారని ఆలయ ట్రస్టు భావిస్తోంది. భక్తుల సౌకర్యార్థం ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అయోధ్యలో వేర్వేరుచోట్ల 10 పడకల ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ సమయంలో 12 వేల నుంచి 15 వేల మంది అయోధ్యలో బస చేసేందుకు వీలుగా ఆలయ ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. సాధువులు సహా తాము ఆహ్వానించిన ప్రముఖులందరికీ అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. వేర్వేరు బృందాలకు ఈ బాధ్యతలు అప్పగించాం అని వివరించారు. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. జనవరి 20- 24 మధ్య జరిగే విగ్రహ ప్రాణప్రతిష్ఠ, ప్రారంభోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ కూడా హాజరవుతారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరాన్ని సందర్శించే భక్తులు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జన్మభూమి కాంప్లెక్స్‌లో మరో 7 ఆలయాలను దర్శించుకోవచ్చు. ఏడు ధ్వజ స్తంభాల బరువు సుమారు 5,500 కిలోలు. రామమందిరం చుట్టూ 800 మీటర్ల పొడవున నిర్మిస్తున్న రింగ్ రోడ్డు చివరి దశలో ఉంది. మరోవైపు ప్రాకారాలలో నుంచే కాకుండా రింగ్‌ రోడ్డు మార్గం నుంచి కూడా ఆలయాన్ని  సందర్శించవచ్చు. ఆలయంలోని నేలను పాలరాతితో తీర్చిదిద్దుతున్నారు. 60 శాతం మేరకు ఫ్లోర్‌లో మార్బుల్‌ను అమర్చారు.

Related Posts