YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

31 నైట్ కంట్రోల్ లో వుండండి ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక

31 నైట్ కంట్రోల్ లో వుండండి ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక

బాలానగర్
బాలానగర్ ట్రాఫిక్ డివిజన్ ఏ.సి.పి ఆద్వర్యంలో   జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషను లో  విలేఖరుల సమావేశం నిర్వహించారు. దీంట్లో  జీడిమెట్ల ట్రాఫిక్ సి.ఐ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు
ఏసీపీ శ్రీనివాస్  మాట్లాడుతూ తన సంవత్సర వేడుకలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు జరగకుండా 31 వ తేదీ రాత్రి 8.00 గంటల నుండి జనవరి01 వ తేదీ ఉదయం వరకు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ( ఎగ్జిట్ నెం 4 మల్లంపేట్ - శంభీపూర్ ఎగ్జిట్ 5 దుండిగల్ మూసి వేస్తున్నమని అన్నారు.
ప్రజలు సామాజిక బాధ్యత వహిస్తే రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ఉండే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని అన్నారు. ప్రజలు,వాహనదారులు రోడ్లపైకి వచ్చేటప్పుడు సామాజిక బాధ్యత పాటించాలని అలాగే  నూతన సంవత్సర వేడుకల్లో యువత మద్యం సేవించి వాహనాలను నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. ఒక వేళ మద్యం సేవించి, హెల్మెట్ లేకుండా,,, నియమ నిబంధనలు పాటించకుండా వాహన దారల పై చట్టపరమైన,, న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఒకరు  వాహనాలు అజాగ్రత్త నడిపితే  ఒకరు  ఇంకొకరి ప్రాణాలకు ముప్పు ఉండవచ్చని అన్నారు. ఓ వ్యక్తి ప్రమాదంలో మృతి చెందితే సదరు వ్యక్తి కుటుంబం రోడ్డుపై పడుతుందని, ఒకరి నిర్లక్ష్యంతో మరొకరు ఇబ్బందుల పాలవుతారని ఎసిపి  చెప్పుకొచ్చారు. డిసెంబర్ 31 రోజున 12 బృందాలతో పటిష్ట డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయనున్నట్లు వెల్లడించారు.

Related Posts