YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్న కార్పోరేట్ సంస్థలు : పొంగులేటి సుధాకర్ రెడ్డి

ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్న కార్పోరేట్ సంస్థలు : పొంగులేటి సుధాకర్ రెడ్డి

ప్రభుత్వం ఫీజుల నియంత్రణ విషయంలో నిర్ణయం తీసుకోవడం లేదు. పేరెంట్స్ ఈ విషయంలో చాలా  అసంతృప్తితో ఉన్నారు. తల్లిదండ్రులు అప్పులు చేసి డోనేషన్లు కట్టే పరిస్థితి ఉందని కాంగ్రెస్ ఎమ్మల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్నాయి. నియమ నిబంధనలను ,జీఓ లను ఈ ప్రభుత్వం అటకెక్కించింది. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు ఆందోళనతో ఉన్నారు. ఇంతవరకు డీఎస్సీ లేదు. గురుకుల పాఠశాల లు అద్దె భవనాలలో ఉన్నాయి.ప్రైవేట్ పాఠశాలలు ఏది చెబితే పేరెంట్స్ అదే చేసే పరిస్థితి ఉంది.బుక్స్,పాఠశాల యూనిఫామ్,స్టేషనరీ పేరుతో విద్యార్థులతో అక్రమంగా ఫీజులు వసూలు చెస్తున్నారని అన్నారు. దాదాపు 10వేల నుండి 12 వేలు రూపాయలు అక్రమంగా ప్రైవేట్ విద్య సంస్థలు విద్యార్థుల నుండి వసూలు చేస్తున్నారు. గురుకుల పాఠశాలలో ప్రమాణాలు పాటించడం లేదు,సరైన సదుపాయాలు కల్పించడం లేదు. విద్యాశాఖలో గందర గోళ పరిస్థితి ఉంది.వెంటనే సీఎం ఈ విషయంలో కల్పించుకకోవాలని అయన అన్నారు. మధ్యతరగతి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.ఫీజుల నియంత్రణ విషయంలో చర్యలు చేపట్టాలని పేరెంట్స్ సెక్రెటేరియట్ వద్ద ధర్నా చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విద్యా ప్రమాణాలు ప్రభుత్వం పాటించడం లేదు, కానీ ప్రచారం మాత్రం భారీగా చేస్తుందీ ఈ ప్రభుత్వం.విద్య శాఖలో అక్రమాలు,అవినీతి జరుగుతుంది అనే అనుమానం కలుగుతోంది. మెరిట్ సాధించిన విద్యార్థులకు కూడా అన్యాయం జరుగుతుందని అయన ఆరోపించారు. మేనేజ్మెంట్ కోటలో కాలేజ్  సీట్లన్నీ భర్తీ అవుతున్నాయి. ప్రైవేట్ కళాశాలలో,విద్య సంస్థలలో ప్రభుత్వం చేపట్టాల్సిన తనికీలు చేపట్టడం లేదు. బంగారు తెలంగాణ అంటున్న కేసీర్ విద్యావ్యవస్తాను ఎందుకు పట్టుంచుకోవడం లేదు. ఫ్రొఫెసర్ తిరుపతి రావు కమిటీ ఎందుకు వేశారో కూడా మరిచారు. ప్రైవేట్ విద్య సంస్థలకు మేలు చేసేలాగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయి. తెలంగాణలో విద్యను వ్యాపారంగా మార్చారని విమర్శించారు.

Related Posts