YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాష్టం లో పేద పిల్లలకూ నాణ్యమైన విద్య సీఎం జగన్

రాష్టం లో పేద పిల్లలకూ నాణ్యమైన విద్య సీఎం జగన్

అమరావతి
పేదల తలరాతలు మార్చే ఆస్తి చదువు. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం చేస్తున్నామని  సీఎం జగన్ అన్నారు. ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నాం. పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వస్తున్నాయి. 8.09 లక్షల మంది విద్యార్థులకు రూ.584 కోట్లు ఆర్థిక సాయం అందింది. 2023-24 జూలై-సెప్టెంబర్ జగనన్న విద్యాదీవెన నిధులు జమ చేసామని అన్నారు.
ఇప్పటివరకు విద్యా దీవెన పథకం ద్వారా రూ.11,900 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.4,275 కోట్లు ఇచ్చాం. నాలుగున్నరేళ్లలో విప్లవాత్మకమైన అడుగులు వేశాం. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ బడుల రుపురేఖల్ని మార్చాం. 27.61 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందించాం. తరగతి గదులను డిజిటల్ క్లాస్రూమ్లుగా మార్చాం. తో విలువైన బైజూస్ కంటెంట్ అందించాం. స్కూళ్లల్లో సబ్జెక్ట్ టీచర్లను తీసుకొచ్చాం. విద్యార్థుల భవిష్యత్ బాగుండాలన్నదే ప్రభుత్వ తాపత్రయం. ఉన్నత విద్యలో సంస్కరణలు తీసుకొచ్చామని అన్నారు.

Related Posts