YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మరో 2 రోజులు చలి తీవ్రత

మరో 2 రోజులు చలి తీవ్రత

హైదరాబాద్, డిసెంబర్ 30,
కొద్దిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఉదయం వేళల్లో పొగమంచు తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోంది. అయితే ఈ రెండు రోజుల పాటు అత్యంత చలి తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. చలి తీవ్రతనే కాకుండా… పొగ మంచు ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో…ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, మెదక్ జిల్లాలో ఉదయం వేళల్లో అధికంగా పొగమంచు పరిస్థితులు ఉంటాయని తెలిపింది.ఇక ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, మెదక్ జిల్లాలో పొగ మంచు ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఆ తర్వాత రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. చలి తీవ్రత, పొగమంచు ఎఫెక్ట్ ఎక్కువ ఉండనున్న నేపథ్యంలో… వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిచింది.ఇక ఏపీలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉత్తర కోస్తా, యానాంలో దిగువ ట్రోపో ఆవరంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాలో తూర్పు, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని పేర్కొంది.

Related Posts