YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

3 నుంచి పార్లమెంట్ ఎన్నికలకు ప్లాన్

3 నుంచి పార్లమెంట్ ఎన్నికలకు ప్లాన్

హైదరాబాద్, డిసెంబర్ 30,
పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సమాయత్తమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. అందుకోసం జనవరి మూడో తేదీ నుంచి బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు,  మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి ఇతర సీనియర్ నేతల సమక్షంలో ఈ రివ్యూలు జరగనున్నాయి. కేసీఆర్‌కు తుంటి ఆపరేషన్ జరగడంతో ఇంకా కోలుకోలేదు. అందుకే కేటీఆర్ అధ్యక్షతన సమావేశాలు జరగనున్నాయి. రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సమీక్షలు కొనసాగుతాయి. సంక్రాంతి పండుగ కారణంగా మధ్యలో మూడురోజుల విరామమిచ్చి, మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను సంక్రాంతి తరువాత పార్టీ కొనసాగించనున్నది.జనవరి 3న ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంతో సన్నాక సమావేశాలు షురూ అవుతాయిఇందులో భాగంగా జనవరి 3 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కే కేశవరావు, మాజీ స్పీకర్ ంమధుసూధనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర ముఖ్యనాయకులు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. జనవరి 3 నుంచి 12 వరకు తెలంగాణ భవన్‎లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో.. మధ్యలో మూడురోజుల విరామమిచ్చి, అ తరువాత మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను కొనసాగించనున్నారు.
పార్లమెంట్ నియోజకవర్గాలు.. సమావేశాల తేదీలు
3న ఆదిలాబాద్
4న కరీంనగర్
5న చేవెళ్ల
6న పెద్దపల్లి
7న నిజామాబాద్
8న జహీరాబాద్
9న ఖమ్మం
10న వరంగల్,
11న మహబూబాబాద్
12న భువనగిరి
సంక్రాంతి తరువాత..
16న నల్గొండ
17న నాగర్ కర్నూలు
18న మహబూబ్ నగర్
19న మెదక్
20న మల్కాజ్ గిరి
21 సికింద్రాబాద్, హైదరాబాద్
వీరందరికీ ఆహ్వానం..
ఈ సమావేశాలకు ఆయా పార్లమెంట్ పరిధిలోని ముఖ్యులందరినీ ఆహ్వానించనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల ఎంపీలు, పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, నగర మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇంచార్జీలు, జిల్లాపార్టీ అధ్యక్షులతో పాటు ముఖ్యనేతలు సమావేశాలకు హాజరవుతారు.తెలంగాణ భవన్ లో జరిగే ఈ సమావేశాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మీటింగ్ కు హాజరయ్యే ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్వల్ప ఓట్ల శాతం తేడాతోనే అనేక సీట్లు చేజారిన నేపథ్యంలో.. వాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జరగబోతున్న ఈ సమీక్షల అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచారపర్వాన్ని బలంగా నిర్వహించేందుకు కూడా పార్టీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

Related Posts