YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ గ్రూప్ పాలిటిక్స్ మరోసారి బహిర్గతం

టీడీపీ గ్రూప్ పాలిటిక్స్ మరోసారి బహిర్గతం

విజయవాడ, జనవరి 2,
ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నీతి, నిజాయితీపరులే రాజకీయాల్లోకి రావాలన్నారు. సంపాదన కోసం కొంతమంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్ గా మారిందన్నారు. తాను ఎవరినీ దోచునోను, ఎవరినీ దోచుకోనివ్వను అని తేల్చి చెప్పారు కేశినేని నాని. అందుకే తనపై అక్రమార్కులు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.విజయవాడ వెస్ట్ నుంచి తన కూతురు శ్వేత పోటీ చేస్తుందన్న ప్రచారం జరుగుతోందని, అది అవాస్తవం అన్నారు. తాను కానీ, తన కుటుంబసభ్యులు కానీ ఎవరూ పోటీ చేయరని కేశినేని నాని స్పష్టం చేశారు. విజయవాడలో అవినీతి, అక్రమార్కులను సహించేది లేదన్నారు. కొన్ని కబంధహస్తాల నుంచి విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని కాపాడాలని కేశినేని నాని అన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఓటర్లు మంచి వ్యక్తిని ఎన్నుకుంటారని కేశినేని నాని వ్యాఖ్యానించారు.విజయవాడలో టీడీపీ గ్రూప్ పాలిటిక్స్ మరోసారి బహిర్గతం అయ్యాయి. నూతన సంవత్సరం కార్యక్రమాల్లో భాగంగా విబేధాలు మరోసారి తెరపైకి వచ్చాయి. కేశినేని నాని బ్రదర్స్ మధ్య వివాదం అందరికీ తెలిసిందే. పార్లమెంటు పరిధిలో రెండు గ్రూపులుగా విడిపోయారు. కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాలుగా పార్లమెంటు పరిధి మొత్తం విడిపోయింది. ఈరోజు విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి చెందిన కీలక నేతల సమావేశంలో కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన వ్యాఖ్యలు సొంత పార్టీలోని ప్రత్యర్థులను టార్గెట్ చేసి చేసినట్లుగా తెలుస్తోంది. విజయవాడ పార్లమెంటుకు నేను కాపలా కుక్కని అని కేశినేని నాని అన్నారు. దోచుకు తినాలని కొందరు చూస్తున్నారు, కాల్ మనీ వ్యాపారులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని ప్రత్యర్థులను దృష్టిలో పెట్టుకునే నానీ ఈ కామెంట్స్ చేశారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది.విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా గ్రూప్ పాలిటిక్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన ఫాలోవర్ ఎంఎస్ బేగ్ కు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇప్పించి తీరతానని కేశినేని నాని అంటున్నారు. విజయవాడ వెస్ట్ మైనార్టీలకు చెందిన సీటు అంటున్నారు ఆయన. నేను కానీ, మా అమ్మాయి కానీ వెస్ట్ లో పోటీ చేసేది లేదన్నారు.అయితే, మా కుటుంబసభ్యులు అక్కడి నుంచి పోటీ చేస్తారని కొంతమంది ప్రచారం చేస్తున్నారని కేశినేని నాని మండిపడ్డారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లనివ్వనని, ఎట్టి పరిస్థితుల్లో మైనార్టీ వర్గాలకు చెందుతుందని, ఎంఎస్ బేగ్ కే టికెట్ ఇప్పిస్తాననే వ్యాఖ్యలు చేశారు కేశినేని నాని. జగ్గయ్యపేట గురించి కూడా కేశినేని నాని వ్యాఖ్యలు చేశారు. జగ్గయ్యపేటలో మైనింగ్ ను దోచుకునేందుకు కొంతమంది తయారవుతున్నారని ఆరోపించారుటీడీపీలో సీట్ల కేటాయింపుపై చంద్రబాబు కసరత్తు తుదిదశకు చేరుకుంది. ఈ క్రమంలో కేశినేని నాని, చిన్ని వర్గాలు యాక్టివ్ అయ్యాయి. తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత కఠినమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్న కూడా కేశినేని నాని నారా లోకేశ్ ను కలిశారు. విజయవాడ పార్లమెంటుపై ఓ నిర్ణయం తీసుకోబోతున్న తరుణంలో కేశినేని నాని వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి. అదే విధంగా పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్ ల విషయంలోనూ కేశినేని నాని కొంత వ్యతిరేకిస్తున్నారు.ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కూడా దీనికి సంబంధించిన ఫైనల్ డిస్కషన్స్ లో ఉన్నారు. సీట్ల కేటాయింపుపై చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలోనే కేశినేని నాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని ప్రత్యర్థులు చెబుతున్నారు. మొత్తంగా విజయవాడలో జరుగుతున్న పరిణామాలు పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారాయి.

Related Posts