YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

అట్రాసిటీ కేసులపై సమీక్ష

అట్రాసిటీ కేసులపై సమీక్ష
రాష్ట్ర వ్యాప్తంగా యస్.సి,యస్.టి లకు సంబంధించి పెండింగ్ అట్రాసిటీ కేసులపై  జూన్ 6 లోగా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి జిల్లా కలెక్టర్లు, ఎస్.పిలను ఆదేశించారు.
మంగళవారం సచివాలయంలో  నుండి జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి లతో అట్రాసిటి కేసులు, రైతుబంధు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణి, జిల్లాలలో రాష్ట్ర అవతరణ వేడుకలపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ జాతీయ యస్.సి,యస్.టి కమీషన్ ఈ కేసులపై ప్రత్యేకంగా సమీక్షిస్తుందని, జిల్లా కలెక్టర్లు ఎస్.పిలు యస్.సి,యస్.టి అట్రాసిటి కేసులపై ప్రత్యేకంగా సమీక్షించి, పెండింగ్ లో ఉన్నకేసులను సత్వరమే పరిష్కరించడంతో పాటు బాధితులకు వెంటనే నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. యస్.సి,యస్.టి కేసులపై జిల్లా స్ధాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించి కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.  యస్.సి,యస్.టి అట్రాసిటి కేసులు సంభవించినప్పుడు జిల్లా కలెక్టర్లు, ఎస్,పిలు  ప్రత్యక్షంగా పర్యటించాలని, ఈ కేసుల పరిహారపు చెల్లింపులు ట్రెజరీ కంట్రోల్స్ లేవని తెలిపారు. బాధితుల అకౌంట్స్ నెంబర్లను కలెక్టర్లకు ఇవ్వాలని లేనిచో తహసిల్దార్ల ద్వారా వివరాలు సేకరించాలని సి.యస్ అన్నారు. జిల్లా కలెక్టర్లు పోస్కో యాక్టు  కేసులను సమీక్షించాలన్నారు.
 రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ యస్.సి,యస్.టి కమీషన్ ఇటీవల హైదరాబాద్ లో పర్యటించిందని, బాధితులకు పరిహారపు చెల్లింపులు చట్ట ప్రకారం నిర్ధేశించిన కాలపరిమితిలోగా పంపిణీ జరిగేలా చూడాలని ఆదేశించిందన్నారు. జిల్లా యస్.పి లు ఈ కేసులపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఆన్ లైన్ ద్వారా మానిటరింగ్ చేయాలని, ఎఫ్ ఐ ఆర్ లను వెంటనే నమోదు చేసి జిల్లా కలెక్టర్లకు కేసుల వివరాలు పంపాలన్నారు కేసులు సంభవించినప్పుడు విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని డిజిపి కార్యాలయంలో సిఐడి,ఏడిజి సమీక్షిస్తారన్నారు. జిల్లాలలో కేసుల పరిష్కారంలో బెస్ట్ ప్రాక్టీసెస్ ను తెలపాలన్నారు. కేసులు సంభవించినప్పుడు ఫిర్యాదులను నమోదు చేసుకోవటంలో పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 41,09,743 పాసుపుస్తకాలు పంపిణీ చేశామని, ధరణి వెబ్ సైట్ లో ఆధార్ సీడింగ్, డబుల్ ఖాతా, బ్యాక్ లాగ్ సక్సెస్ కరెక్షన్ మాడ్యూళ్ళను సిద్ధం చేశామని కలెక్టర్లకు తెలిపారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి  చంద్రశేఖర్ రావు   జిల్లాల వారిగా పనితీరును ప్రతి రోజు సమీక్షిస్తున్నారని, జూన్ 20 లోగా మిగిలిన పాసుపుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు.
రైతు బంధుకు సంబంధించి 45.13 లక్షల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఆర్ ఓ ఎఫ్ ఆర్ కు సంబంధించి 47 వేల చెక్కులు పంపిణీ చేశామని వ్యవసాయశాఖ కమీషనర్ జగన్ మోహన్ తెలిపారు.
రాష్ట్ర అవతరణ వేడుకలను జిల్లాల్లో ఘనంగా నిర్వహించటానికి పకడ్భందీ చర్యలు చేపట్టాలని జిఏడి ముఖ్యకార్యదర్శి అధర్ సిన్హా జిల్లా కలెక్టర్లను కోరారు.  వేడుకలను గత సంవత్సరం మాదిరిగానే నిర్వహించాలని ఇప్పటికే తగు మార్గదర్శకాలను జారీ చేసినట్లు ఆయన వివరించారు. జిల్లాలో సాధించిన ప్రగతి, అభివృద్ధి, రాష్ట్ర స్ధాయిలో చేపట్టిన ప్లాగ్ షిప్ కార్యక్రమాల వివరాలతో ప్రసంగాలను రూపొందించాలన్నారు.  జిల్లా స్ధాయిలో ఉదయం వేడుకల నిర్వహణతో పాటు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ముఖ్యప్రాంతాలను విద్యుద్ధీకరించడంతో పాటు ఆసుపత్రులు, అనాధ శరణాలయాల్లో పండ్ల పంపిణీ, ఫుడ్ ఫెస్టివల్, స్వచ్చ క్యాంపేన్ నిర్వహించాలన్నారు.  జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సాంఘీక సంక్షేమ శాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాశ్ జ్యోతి మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్నందున, ఆదాయ,కుల దృవీకరణ పత్రాల జారీని వేగవంతం చేయాలన్నారు.ఆర్ డిఓ లు జారీ చేసే కుల దృవీకరణ పత్రాలపై కలెక్టర్లు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించాలన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో ధరణి స్పెషల్ ఆఫీసర్ రజత్ కుమార్ షైనీ, ప్రొటోకాల్ డైరెక్టర్  అర్వింధర్ సింగ్, సాంఘీక సంక్షేమ శాఖ డైరెక్టర్  కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts