YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆధార్ సేవ కేంద్రాల్లో ప్రజల పాట్లు

ఆధార్ సేవ కేంద్రాల్లో ప్రజల పాట్లు

ఖానాపూర్
నిర్మల్ జిల్లా, ఖానాపూర్ పట్టణం లోని బీఎస్ఎన్లెల్  కార్యాలయంలో నిర్వహిస్తున్న ఆధార్ సేవ కేంద్రంలో నిర్వహకులు జనాల వద్ద అధికంగా చార్జ్ లు వసూలు చేస్తున్నారు.. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి జనాలు భారీగా ఆధార్ సెంటర్ వద్ద తిప్పలు పడుతున్నారు.. 4 రోజులుగా ఆధార్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న పనులు జరుగుతలేవు అటు కాంగ్రెస్ ప్రభుత్వం అభయ హస్తం ఆరు గ్యారింటీలకు ఆధార్ కార్డు  తప్పని సరి అని అంటున్నారు  అదే ఆసరాగా చేసుకొని ఆధార్ సెంటర్ నిర్వాకులు 100 నుండి 150 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆధార్ సెంటర్ లో మెనూ పట్టికలో సూచించిన విధంగా పిల్లలకు కొత్తగా ఆధార్ కార్డు తీసుకోవాలంటే ఫ్రీగా ఇవ్వాలి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే 50 ఛార్జ్ చేయాలి కానీ ఇక్కడ 100 రూపాయలు ఇస్తేనే పనులు అవుతాయి లేకపోతే లేదు అని ఆధార్ నిర్వాకులు చెప్పడంతో ఇదేంటి అని అడిగిన వారికీ మాకు ఆన్లైన్లో ఎక్కువ డబ్బులు కట్ అవుతున్నాయి అని ఆధార్ సెంటర్ నిర్వాకులు చెప్పడంతో చేసేదేమి లేక వాళ్ళు అడిగినన్ని  డబ్బులు చెల్లించి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుంటున్నారు ఇలాంటి ఆధార్ సెంటర్ల పై  చర్యలు తీసుకోవాలని
ప్రజలు కోరుకుంటున్నారు..

Related Posts