YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కర్నూలు ఫ్యాన్ లో ముసలం

కర్నూలు ఫ్యాన్ లో ముసలం

కర్నూలు, జనవరి 5,
ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. అన్ని పార్టీలు అప్పుడే వివిధ రకాల కార్యక్రమాలతో ప్రచార యుద్ధంలోకి దిగాయి. గెలుపు మాదంటే మాదంటూ అన్ని సవాళ్లు విసురుతున్నాయి. గతంలో లాగా కాకుండా ఈసారి ఎన్నికలు హోరాహోరిగా ఉండనున్నాయి. వై నాట్ 175 అంటోన్న అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే వ్యూహాలతో ముందుకువెళ్తోంది. ఇందులో భాగంగానే పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలను, ఇంచార్జీలను తప్పించి కొత్త అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా ప్రకటిస్తుంది. అయితే, ప్రస్తుత ఎమ్మెల్యేలు కొందరూ తమకు సీట్లు కేటాయించకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తూ రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా కర్నూలు ఎమ్మిగనూరు వైసీపీలో అసమ్మతి పెరుగుపోతోంది. మచాని వెంకటేష్ ను నియోజకవర్గ ఇంచార్జిగా అధిష్టానం ప్రకటించడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి వర్గం. ఈ క్రమంలో ఎమ్మిగనూరులో వైసీపీ ముఖ్య నాయకులు భేటి అయ్యారు. ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల ఎంపీపీ లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ లు హాజరైయ్యారుఎమ్మెల్యే సీటు చెన్నకేశవ రెడ్డి కుటుంబానికే టికెట్ కేటాయించాలి డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మిగనూరు లో ఎలాంటి బీసీ నినాదం లేదని కేవలం డబ్బులు ఇచ్చి తప్పుడు సర్వే రిపోర్ట్ పంపించారని విమర్శలు చేస్తున్నారు. ఎమ్మిగనూరు టికెట్ చెన్నకేశవ రెడ్డికి కాకుంటే పార్టీ జెండా మోసిన వారికైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ విషయాలపై అధిష్టానం స్పందిస్తుందా? లేదా అనేది చూడాలి. కాగా, గతంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నా కేశవ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తననే ప్రకటించాలని కోరారు. మరి టికెట్ కేటాయించకపోవడంతో ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి ఏం చేయనున్నారనేది ఆసక్తికరంగా మారిందిఇదిలా ఉంటే.. అధికార పార్టీ వైసీపీలో టికెట్ల పంచాయితీ తారా స్థాయికి చేరింది. పలు సీట్లలో సిట్టింగ్ లను మార్చి వేరే వారిని సమన్వయకర్తలుగా నియమించడంతో టికెట్ దక్కని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ వంశీకృష్ణ పార్టీకి రాజీనామ చేశారు. ఇదే అదనుగా పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ లపై స్థానిక నేతలు. ఆశావహులు అసంతృప్తి గళం వినిపిస్తున్నారు.

Related Posts