YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

16న చంద్రబాబు, మోడీ భేటీ..?

16న చంద్రబాబు, మోడీ భేటీ..?

నాలుగేళ్ల పాటు సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగి, ఇప్పుడు వేరయ్యాయి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసి.. అధికారంలోకి వచ్చిన ఈ పార్టీల స్నేహం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందని, ప్రత్యేకహోదా ఇవ్వకుండా ద్రోహం చేసిందని తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు రావడం, ఆ వెంటనే బీజేపీ కూడా ఏపీ మంత్రి వర్గం నుంచి బయటకు రావడం చకచకా జరిగిపోయింది. ఆ తర్వాత బీజేపీ, టీడీపీల మధ్యన మాటల తూటాలు పేలుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నీతిఆయోగ్ ఆ రోజు సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకూ కేంద్రం సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ హాజరు కానున్నారు. ఇటీవల కేంద్రం తమకు అన్యాయం చేస్తోందని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు అంటున్న నేపథ్యంలో.. ఈ సమావేశం కీలకం అవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.ప్రత్యేకహోదా విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీని విమర్శిస్తూ ఉంటే, తమతో కలిసి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేకహోదా గురించి అడగనేలేదని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రత్యేకహోదా వద్దు అని అప్పట్లో చంద్రబాబు అన్నారని కమలనాథులు గుర్తు చేస్తున్నారు. నిధుల కేటాయింపులో కూడా మోడీ అన్యాయం చేశారని బాబు అంటుంటే, కేటాయింపులు బాగున్నాయని అంటూ అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం చేసింది మీరు కాదా? అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఇక మహానాడు వేదికగా బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో ఇప్పుడు త్వరలోనే చంద్రబాబు, ప్రధాని మోడీలు ఎదురుపడనున్నారనే వార్త వస్తోంది. వచ్చే నెల 16న ఇందుకు ముహూర్తమని సమాచారం. 

Related Posts