YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ కు తలనొప్పిగా సిక్కోలు

జగన్ కు తలనొప్పిగా సిక్కోలు

శ్రీకాకుళం, జనవరి 5,
రాష్ట్రంలో వైకాపా అసెంబ్లీ టిక్కెట్ల వ్యవహారం ఓ కొలిక్కి వస్తున్నా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఎనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక అధిష్టానానికి తలనొప్పిగా మారింది. జిల్లాలో రెండు సీట్లు మినహా మిగిలిన ఆరు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు ఎవరనేదానిపై తాడేపల్లిలో కుర్చీలాట జరుగుతోంది. ఇంతవరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పలు రూపాల్లో జరుపుకొన్న సర్వేల ప్రకారం అభ్యర్థులను నిర్ణయించడానికి కూడా ఇక్కడ సీనియర్లు అడ్డొస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల ప్రకటన ఓ కొలిక్కి వచ్చినా జిల్లాకు సంబంధించి మాత్రం మరో 15 రోజులు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.తొలివిడతలో 11, రెండో విడతలో 27 మొత్తం కలిపి 38 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త నేతలను ప్రకటించినా జిల్లాలో మాత్రం ఏ నిర్ణయానికీ రాలేకపోతున్నారు. ఇక్కడ సీనియర్లు ఎక్కడికక్కడ పీఠముడి వేయడంతో తేల్చుకోలేకపోతున్నారు. ఇచ్ఛాపురంలో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జి పిరియా సాయి రాజ్ కు టిక్కెట్ ఇస్తారని ఇంతకు ముందే జగన్ మోహన్ రెడ్డి మాటిచ్చారు. అందులో భాగంగానే పిరియా దంపతులు ఇచ్ఛాపురంలో శక్తివంచన లేకుండా కష్టపడు తున్నారు. రెండుసార్లు టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ చేతిలో ఓడిపోవడంతో ఈసారి సానుభూతితో పాటు సంక్షేమ పథకాలు కూడా పిరియా సాయి రాజ్ కు కలిసొస్తాదని పార్టీ నమ్ముతోంది. అయితే జిల్లాలో ఉన్న రెవెన్యూ మంత్రి ఇచ్ఛాపురం, పాతపట్నం నియోజకవర్గాల్లో తాను సూచించిన అభ్యర్థులకు టిక్కెట్ ఇవ్వాలని తెర వెనుక నుంచి ఒత్తిడి తెస్తున్నట్టు భోగట్టా.వాస్తవానికి ధర్మాన ప్రసాదరావుకు ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ నియోజక వర్గాల అభ్యర్థులను నిర్ణయించే కేపబిలిటీ ఉంది. కాకపోతే ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఆయన సూచిస్తున్న పేర్లపైనే పార్టీకి అనేక అనుమానాలు ఉన్నాయట. 2004, 2009 ఎన్నికల్లోరాజశేఖరరెడ్డి జిల్లాలో అభ్యర్థులను నిర్ణయించే బాధ్యత ధర్మాన ప్రసాదరావుకే అప్పగించారు. ఈ రెండు పర్యాయాలు జిల్లాలో ఆయన చెప్పినవారికే సీట్లిచ్చారు. 2009లో అయితే 10 అసెంబ్లీ సీట్లకు గాను 9 మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోగలిగారు. రాజశేఖరరెడ్డి ప్రాతినిధ్యం వహించిన కడప జిల్లాతో సహా ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపారు. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు అడుగుతున్న ఇచ్ఛాపురం, పాతపట్నం వైకాపా టిక్కెట్లు ఇస్తే ఆయన గెలిపించగలరా, లేదా అన్న విషయం పక్కన పెడితే ఈ రెండు ప్రాంతాలపైన ఆయనకు పట్టు ఉంది. ఇచ్ఛాపురంలో నరేష్ కుమార్ అగర్వాల్ (లల్లూ) వంటి మైనార్టీ నేత 2004లో గెలిచినా అందులో ధర్మాన పాత్ర పెద్దది. అలా అని ఈ ఎన్నికలు అలా కనిపించడంలేదు.దానికి తోడు ధర్మాన ప్రసాదరావు సూచిస్తున్న అభ్యర్థి ప్రొఫెసర్ విష్ణుమూర్తిది ఇచ్ఛాపురం నియోజకవర్గమే అయినా ఆయనకు అక్కడ ఎవరితోనూ పరిచయాలు లేవు. దీనికి తోడు పార్టీ చేసిన ఏ సర్వేలోనూ ఆయన పేరు వినపడలేదు. ప్రొఫెసర్ విష్ణుమూర్తి టెక్కలి ఐతమ్ కళాశాలలో మేనేజ్మెంట్ కోర్స్ విభాగానికి ఇచ్ఛాపురం, పాతపట్నం కోసం ధర్మాన పట్టుఅధిపతిగా ఉన్నారు. రెడ్డిక సామాజికవర్గానికి చెందిన విష్ణుమూర్తిని అక్కడ గెలిపించుకోవడం అంత సులువు కాదు. సిటింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ వరుసగా మూడోసారి గెలవడం సాధ్యం కాదని భావిస్తున్నా నర్తు రామారావు, నర్తు నరేంద్ర యాదవ్ లాంటి నేతలు ధర్మాన వెనుక ఉన్నా విష్ణుమూర్తి అభ్యర్థి అయితే పార్టీలో మెజార్టీ వర్గం సహకరించే పరిస్థితి ఉండదు. జిల్లాలో రెడ్డిక ఓట్లు అన్ని నియోజకవర్గాల్లో పోలరైజ్ కావాలంటే, ఇచ్ఛాపురంలో ఆ సామాజికవర్గానికే సీటివ్వడం తప్పనిసరైతే విష్ణుమూర్తి కంటే పార్టీ కమిట్మెంట్ తో ఉన్న సాడి శ్యాంప్రసాద్ రెడ్డి లాంటి నేతలు ఉన్నారు. కానీ ఇప్పటికీ అక్కడ వైకాపా తరఫున బలమైన నాయ కత్వం జెడ్పీ చైర్ పర్సన్ పిరియా దంపతుల తోనే ఉంది. ధర్మాన ప్రసాదరావు ప్రొఫెసర్ విష్ణుమూర్తి పేరును ప్రతిపాదిస్తున్నారని బయటకు పొక్కడంతో ఇంతవరకు ధర్మాన గ్రూపులో ఉన్న సాడి శ్యాంప్రసాదొడ్డి కూడా ఇప్పుడు వెనక్కు వచ్చేశారని తెలుస్తుంది.ఇక పాతపట్నంలో కూడా ధర్మాన ప్రసాదరావుకు బలమైన పట్టు ఉంది. ఇది కాపు సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గమే అయినా ఇక్కడ పార్టీలకు అతీతంగా ధర్మానకు అభిమానులున్నారు.
ఇక్కడ కూడా రెడ్డి శాంతిని కాదని తాను సూచించిన అభ్యర్థికి టిక్కెట్ ఇస్తే గెలిపించుకు వస్తానని చెబుతున్నారట. వాస్తవానికి సిటింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతికి 80 శాతం టిక్కెట్ జగన్మోహన్ రెడ్డి కన్ఫం చేశారు. ఆ నియోజకవర్గంలో వైకాపా కేడర్లో ఎక్కువ మొత్తం ఆమెను వ్యతిరేకిస్తుందని, వారందర్నీ ఉత్తరాంధ్ర వైకాపా ఇన్ఛార్జి బొత్స సత్యనారాయణ వద్దకు తీసుకువెళ్లి మిగిలిన 20 శాతం గట్టి చేసుకోవాలని పార్టీ సూచించింది. అయితే ఇంతవరకు పాతపట్నం అసమ్మతి నాయకు లను రెడ్డి శాంతి బొత్స వద్దకు తీసుకువెళ్ల లేకపోయారు. కారణం.. అసమ్మతి నేతలంతా ధర్మాన ప్రసాదరావుతో ఉన్నారు. అందుకే ఇక్కడ ధర్మాన తాను చెప్పిన నేతకు టిక్కెటిస్తే గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేస్తు న్నారు.దీనిపై అధిష్టానం ఎటూ తేల్చుకోలేక పోతోంది. ఇక టెక్కలిలో ఐప్యాక్ టీమ్ నిర్వహించిన సర్వేల్లో పేరాడ తిలక్ముందువరుసలో ఉన్నారు. అయితే ఇప్పటికే అక్కడ రెండుసార్లు ఇన్ఛార్జిలు మారారు. దీంతో ఎవరి పేరు ప్రకటించాలనే దానిపై పార్టీ ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. ఆమ దాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారామ్క టిక్కెట్ ఖరారు చేశారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే ఈయనకు కూడా శతశాతం ఆమోదం లభించలేదు. ఆమధ్య తాడేపల్లి ఆఫీసుకు పక్కన చెవిరెడ్డి భాస్కరరెడ్డి గెస్ట్హౌస్లో ఏర్పాటుచేసిన వాష్రూమ్లో స్పీకర్ సీతారామ్కు రెండు పూటలు కౌన్సిలింగ్ చేసినట్లు భోగట్టా. ఇందులో ఒక పూట ముగిసిన తర్వాత బయటకు వచ్చిన సీతారామ్ తనకే టిక్కెటి చ్చారని మీడియాకు లీకులిచ్చారు. కానీ రెండోపూట జరిగిన సమావేశంలో ఆయన చేసిన తప్పులు ఎత్తిచూపి గెలవడానికి ఉన్న దారులేంటని అడిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వైకాపా ఎమ్మెల్సీలుగా ఉంటూ పార్టీ ఫిరాయించిన, వైకాపాలో టిక్కెట్ రాకుండా తెలుగుదేశంకు వెళ్తున్న సిట్టింగులపై అసెంబ్లీ ఎన్నికల్లో అనర్హత వేటు వేసే అంశాన్ని స్పీకర్ ముందుంచి వారిని సస్పెండ్ చేసిన తర్వాత మాత్రమే సీతారామ్ అభ్యర్థిత్వం మీద ఒక నిర్ణయానికి వస్తారు.ప్రస్తుత రేసులో అయితే మాత్రం ఆయన ముందే ఉన్నారు. కానీ శతశాతం ఖరారు కాలేదు. ఎటొచ్చీ ఇచ్ఛాపురం రెడ్డిక సామాజికవర్గానికి కేటాయించడంపైనే పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. 1952 నుంచి జరుగుతున్న ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఏడుగురు రెడ్డిక సామాజికవర్గ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 1952లో నీలాద్రిరావు రెడ్డి, 1980లో దక్కత అచ్చుతరామయ్య గెలిచారు. వీరు కాకుండా దక్కత ఏకాంబరి,బుద్దాల త్రినాథరెడ్డిలు చెరో రెండుసార్లుఓడిపోయారు. సంఖ్యాపరంగా ఇక్కడ రెడ్డికసామాజికవర్గం ఎక్కువే ఉన్నారు. అయితే ఈఒక్క కులం ఓట్లతోనే వీరు గెలవలేదు.2011లో అనధికారికంగా జరిపిన లెక్కలప్రకారం రెడ్డిక ఓటర్లు 31,579 మందిఉన్నారు. ఆ తర్వాత స్థానంలో యాదవులు28,456, § 26,232ఉన్నారు. తూర్పుకాపులు 10,600,శ్రీశైన10,246,జాలరి08 18,956,ఒరియా బ్రాహ్మణులు 9,686 మందిఉన్నారు. ఇప్పుడు యాదవులకు ఎమ్మెల్సీఇవ్వడం వల్ల రెడ్డిక, యాదవులు కలిస్తేఇచ్ఛాపురంను కైవసం చేసుకోవచ్చనేదిధర్మాన ఆలోచన. అయితే ప్రొఫెసర్విష్ణుమూర్తికి రెడ్డిక ఓట్లు కనీస స్థాయిలోకూడా పడతాయన్న నమ్మకం లేదు. అలాగేయాదవులు గంపగుత్తగా నర్తు రామారావువెనుక లేరు.మొన్నటికి మొన్న ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్మన్ పిలక రాజ్యలక్ష్మి పేరు పరిశీలనలోకి వచ్చిందో లేదో అప్పుడేఫిర్యాదులు మొదలైపోయాయి. అలాంటిదివిష్ణుమూర్తికి అధిష్టానం టిక్కెట్ ఇచ్చే సీన్ఉండకపోవచ్చు. ఈ విషయం ధర్మానకుకూడా తెలియంది కాదు. కాకపోతే పిరియాసాయిరాజ్ను తప్పించడం కోసం రెడ్డిక నినాదం ఎత్తుకున్నారని తెలుస్తుంది.వాస్తవానికి పిరియా సాయిరాజ్తోనే మేజర్సామాజికవర్గాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ధర్మానచాణక్యం, చక్రం తిప్పడం కుదురుతుందోలేదో కూడా ప్రస్తుతానికి తెలీదు. ఇక్కడరెడ్డిక సామాజికవర్గానికే టిక్కెట్ ఇవ్వాల్సివస్తే పిరియా కుటుంబానికి ఎంపీ స్థానంకేటాయిస్తారన్న ప్రచారం కూడాజరుగుతోంది. ఈ సమీకరణాలన్నీతేలాలంటే మిగతా అన్నిచోట్లా అభ్యర్థులఖరారు పూర్తికావాలి.

Related Posts