YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పొత్తులపై రాని క్లారిటీ

పొత్తులపై రాని క్లారిటీ

విజయవాడ, జనవరి 5,
టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా? ఏపీ వ్యవహరాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టిందా.. ? పొత్తులపై అభిప్రాయాలను తెలుసుకునేందుకే తరుణ్‌చుగ్‌ వచ్చారా?. ఇవాళ్టి పదాధికారుల సమావేశంలో ఏం జరగబోతుంది.? ఇలాంటి ప్రశ్నలతో .. ఏపీలో రాజకీయం వేడేక్కింది. గెలుపే అజెండాగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదే తరుణంలో ఏపీ బీజేపీ కూడా దూకుడు పెంచింది. విజయవాడ కేంద్రంగా బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి నేతృత్వంలో పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మొత్తం 11అంశాలతో ఏపీ బీజేపీ రాజకీయ తీర్మానం చేసింది. 10 తీర్మానాలు వైసీపీ వైసీపీ వైఫల్యాలపై చేస్తే.. ఒక తీర్మానం మాత్రం జనసేన మిత్రపక్షమని పేర్కొన్నారు. ఈ రాజకీయ తీర్మానాన్ని ఏపీ బీజేపీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఏపీలో వైసీపీ సర్కార్‌ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఒక్క కొత్త ఫ్యాక్టరీ కూడా రాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమవిగా చెప్పుకొని ప్రభుత్వం పబ్బం గడుపుతోందని మండిపడ్డారు పురందేశ్వరి.మరోవైపు తీర్మానాల్లో టీడీపీతో పొత్తు అంశాన్ని ప్రస్తావించలేదు. టీడీపీతో పొత్తు అంశాన్ని పార్టీ మైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పార్టీ ముఖ్య నేతలు సూచించారు. మొత్తంగా ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పార్టీ శ్రేణుల్లో ఉన్న పొత్తుల డైలమాను తేల్చేసే దిశగా కసరత్తు చేస్తోంది బీజేపీ. టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే కలిసి పోటీ చేస్తామని ప్రకటించడంతో ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది పొత్తులపై నేతల అభిపప్రాయాలను తరుణ్ చుగ్‌కు ఏపీ బీజేపీ ముఖ్యనేతలు వివరించనున్నారు. నేతల అభిప్రాయాలను విడివిడిగా తెలుసుకొని కేంద్ర పెద్దలకు ఫైనల్‌ అవుట్‌పుట్ ఇస్తారని తెలుస్తుంది. షో ఇవాళ్టి పధాదికారుల భేటీలో పొత్తులపై స్పష్టత వచ్చే ఛాన్స్ లేకపోలేదంటున్నారు బీజేపీశ్రేణులు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల వెళ్తాయన్న చర్చల నేపథ్యంలో పొత్తులపై చర్చించి.. బీజేపీ నేతలు ఢిల్లీకి రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. రాష్ట్ర నేతల అభిప్రాయం మేరకు హైకమాండ్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

Related Posts